కీర్తి సురేష్ కి అలా చేయడం రాదా..? ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా..?

ప్రస్తుత కాలంలో ఫ్యాష‌నేట్‌గా రెడీ అవ్వడానికి యువతతో పాటు స్టార్ హీరో, హీరోయిన్స్ చాలా ఆసక్తి చూపుతున్నారు. హీరోయిన్స్ ఎప్పటికప్పుడు వచ్చే ఫ్యాషన్ లుక్‌లో కనిపించడంలో ముందంజలో ఉంటున్నారు. ఏ రోజు వచ్చిన ట్రెండ్ ఆ రోజు ఫాలో అవుతూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. కొత్త లుక్ తో తయారవుతూ ప్రేక్షకులను ఆదరించే స్టార్ హీరోయిన్స్ లో సమంత, పూజా హెగ్డే, రకుల్ ఇలా వీరంతా ఫేమస్ అవుతుంటే.. నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్ లో నాచురల్ బ్యూటీగా కనిపించిన కీర్తి సురేష్ కూడా ఫ్యాషన్బుల్‌గా రెడీ అవ్వడానికి సిద్ధమయ్యింది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే ట్రెడిషనల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో తర్వాత తెలుగులో వ‌రుస‌ సినిమాల్లో నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. మహానటి సినిమాలో తన ట్రెడిషనల్ లుక్ తో అభినయంలో కూడా అచ్చం మహానటి సావిత్రిలా ఉంది అనిపించే విధంగా నటించింది. అప్పటివరకు ట్రెడిషనల్ లుక్ లో నాచురల్ బ్యూటీగా కనపడిన కీర్తి ..మహానటి సినిమా తరువాత వ‌చ్చిన సర్కారు వారి పాట సినిమాలో ఎక్స్పోజింగ్ చేస్తూ హాట్ బ్యూటీలా దర్శనమిచ్చింది. ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ కూడా మిగతా హీరోయిన్ల బాటలోనే గ్లామర్ ఫోటోషూట్లకు రెడీ అయింది.

బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌ సన్నబడి పొట్టి బట్టలు వేసుకుంటూ తన అందాల ఆరబోతల విషయంలో తగ్గేదేలే అంటుంది. అయితే తాజాగా కీర్తి బ్లాక్ కలర్ లో ఉన్న ప్యాంటు షర్ట్ ధరించి ఓవర్ మేకప్ తో దర్శనమిచ్చింది. ఆ డ్రస్ ఆమెకు సెట్‌కాలేదు. ఆమె ఇచ్చిన ఫోజులు కూడా వేరే విధంగా ఉండడంతో ఆమెపై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ మోడ్రెన్ వేర్‌లో ట్రెండీగా కనిపిస్తూ హాట్ ఫోటోషూట్‌లు చేసినప్పటికీ అవి అంతగా క్లిక్ కావడం లేదు. ఆమెకు ఫ్యాషన్బుల్ గా రెడీ అవ్వడం రాదు అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్.