ప్ర‌భాస్‌కు యాక్టింగే రాదు పాన్ ఇండియా హీరోనా.. స‌లార్ టీజ‌ర్‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయిన స్టార్‌..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకున్న సినిమాలలో స‌లార్ కూడా ఒకటి. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. కే జి ఎఫ్ లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

అంచనాలను ఈ టీజర్ మరో లెవల్ కు తీసుకువెళ్లింది. ఇదే సమయంలో ఈ టీజర్ పై కొందరు నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. అలాంటి వారిలో క‌శ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాతో దేశం మొత్తం పాపులర్ అయిన వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ టీజర్ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. వివేక్ అగ్నిహోత్రి ఈసారి ప్రభాస్‌ను టార్గెట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆయన పరోక్షంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎవరూ హింసని కోరుకుని పుట్టరు.. ఇండస్ట్రీ పెద్దలు పిల్లలని శాంతివైపు ప్రేరేపించేలా నడుచుకోవాలి… కానీ సినిమాల్లో, రాజకీయాల్లో హింసని ఒక ఫ్యాషన్ గా మార్చేస్తున్నారు. ఇలాంటి ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే మార్గం. ప్రస్తుతం సినిమాల్లో మితిమీరిన హింసని ప్రమోట్ చేయడం, అర్థం లేని సినిమాలను తీస్తే అదే ప్ర‌తిబింబంగా పరిగణించబడుతుందా అంటూ ఎద్దేవా చేశాడు.

అసలు ఒక మంచి నటుడు కానీ వ్యక్తిని.. బిగ్గెస్ట్ హీరో అని ప్రమోట్ చేయడం ఇంకా పెద్ద టాలెంట్.. అంటూ వివేక్ అగ్నిహోత్రి సలార్ టీజర్లో ప్రభాస్ పేరు చెప్ప‌కుండానే పరోక్షంగా కామెంట్లు చేశాడు. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే సలార్ రిలీజ్ అయ్యే రోజునే వివేక్ తెరకెక్కిస్తున్న ది వ్యాక్సిన్ వార్‌ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తన సినిమాపై అంచనాలు పెంచుకునేందుకే సలార్‌ టీజర్ టార్గెట్ చేసి ఉంటారని ప్రభాస్ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అంతగా సంతృప్తి పరచలేదు. దీంతో సలర్‌ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి