సినిమా ఇండస్ట్రీలో మామూలుగా ఒక హీరోతో అనుకున్న సినిమాను మరొక హీరోతో తీయడం అనుకోకుండానే రాత్రికి రాత్రి దర్శక నిర్మాతలు లేదంటే నటీనటులు సాంకేతిక నిప్పులు మారిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఒక హీరో, హీరోయిన్లు వదులుకున్న సినిమాలను వేరే హీరో హీరోయిన్లు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి చిన్న విషయం వెంటనే తెలిసిపోతోంది.
అయితే మన పాత రోజుల్లో ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయి. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలోనే విశ్వ నటుడు కమల్ హాసన్, శోభన్ బాబు మధ్య జరిగిన ఒక ఊహించని సంఘటన గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదే సమయంలో శోభన్ బాబు చేయాల్సిన కథతో కమలహాసన్ సినిమా చేసి భారీ విజయం అందుకోవటంతో శోభన్ బాబు ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆ రోజుల్లో ఈ ఇద్దరు హీరోలు ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేవారు. శోభన్‌బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు. డేట్స్ ఖాళీ లేక చాలా చిత్రాలు వదులుకున్నారట. ఆయనకు కథలు కూడా ఒక పట్టాన నచ్చేవి కావట. వాటిలో మొదట వద్దనుకుని, తర్వాత ఫీల్ అయిన సినిమాలలో ఆకలిరాజ్యం కూడా ఒకటి.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తన జీవితంలో రాజీ పడని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పేద నిరుద్యోగ యువకుడిగా హీరో ఉండాలి. అతడికి ఎదురయ్యే సమస్యలు సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులు…ఇవన్నీ బాగానే ఉన్నా అదే సమయంలో హీరో ఎంఏ ఫిలాసఫీ చేసి సెలూన్ లో పనిచేయడం అనే కథాంశం శోభన్ బాబుకి నచ్చలేదట.
ఇక దీంతో కథను మార్చమని దర్శకుడిని అడగగా .. ఆయన హీరో వృత్తికి బదులుగా హీరో పాత్రధారిని మార్చేశారు. అలా కమలహాసన్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వంద రోజుల వేడుకకు శోభన్ బాబుని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడానికి కమల్ హాసన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్తే.. సినిమా ఇంత బాగా వస్తుందని తాను అనుకోలేదని కమల్ ను హత్తుకొని కంటతడి పెట్టారట శోభన్ బాబు.