రు. 100 కోట్ల క‌ళ్యాణ్‌రామ్ సినిమా… క‌ళ్లు చెదిరిపోవాల్సిందే…!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన సినిమా బింబిసార‌. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫాంటసీ డ్రామాగా రూ.40 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ టైంలోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పార్ట్ 3 లో నటిస్తాడంటూ చెప్పిన కళ్యాణ్ రామ్ తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయాడు.

డైరెక్ట‌ర్‌ వ‌శిష్ఠ‌ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో బింబిసార 2 గురించి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ లేటెస్ట్ గా బింబిసార 2 సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బింబిసార 2 సినిమాను జి5 సంస్థ రూ.100 కోట్లకి కొనడానికి సిద్ధంగా ఉందని.. రూ.100 కోట్లకు ఆ సినిమా మొదటి కాపీ వారికే ఇవ్వాలని డీల్ మాట్లాడుకున్నార‌ని స‌మాచారం.

మొదటి పార్ట్ తెర‌కెక్కించిన వశిష్ట పార్ట్ 2 నుంచి తప్పుకోవడంతో రొమాంటిక్ దర్శకుడు అనిల్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తాడంటున్నారు. వశిష్ఠ‌ బింబిసార తీసే సమయంలోనే పార్ట్ 2 కథను కూడా రాసేసాడట. ఈ కథను పక్కన పెట్టి కొత్త కథను రాసేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్‌. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమవుతుంద‌ని… 2024 లో వేసవి సెలవుల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

బింబిసార‌ లో కళ్యాణ్‌రామ్ పాత్ర ముగిసిపోయినట్లు చూపించారు. మధ్యలో సంజీవని ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చు అని ఒక లైన్ వాడారు. ఇప్పుడు ఆ లైన్ బేస్ చేసుకుని కళ్యాణ్ రామ్ ని సంజీవని ద్వారా బ్రతికిస్తూ రెండో పార్ట్ మొదలవుతుందట‌. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై డిస్నీ హాట్ స్టార్ భారీ బడ్జెట్ తో నిర్మించాలనుకుంది. ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ జి 5 వారు టేకప్ చేశార‌ని టాక్ ?