కాకినాడ ఎంపీ క్యాండెట్లు మారిపోతున్నారు… ఈ సారి గెలుపు ఎవ‌రిది…?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ సారి రాజకీయ పోరు ఆసక్తికరంగా జరగనుండనే చెప్పాలి..ఇక్కడ త్రిముఖ పోరు ఖాయంగా జరుగుతుంది. అయితే టి‌డి‌పి-జనసేన కలిస్తే..వార్ వన్ సైడ్ అనే పరిస్తితి. అయితే జిల్లాలో కీలకంగా ఉన్న కాకినాడ పార్లమెంట్ లో ఈ సారి కొత్త అభ్యర్ధులు బరిలో దిగుతారని తెలుస్తోంది. రెండు పార్టీల నుంచి కొత్త నేతలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వంగా గీత, టి‌డి‌పి నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేశారు.

Vanga Geetha Viswanadh | budarajus | Flickr

హోరాహోరీగా జరిగిన పోరులో గీత 25 వేల ఓట్ల తేడాతో సునీల్ పై గెలిచారు. అయితే ఈ సారి ఎన్నికల్లో గీత..అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆమె పిఠాపురంపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. 2009లో ఆమె ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారు. ఈయనపై వ్యతిరేకత ఎక్కువ ఉంది.

ఈ నేపథ్యంలో ఆయన్ని పక్కన పెట్టి గీతాకు ఛాన్స్ ఇస్తారా ? అనేది చూడాలి. ఒకవేళ పిఠాపురం కాకపోయినా మరొక అసెంబ్లీ సీటులోనైనా పోటీ చేయాలని గీత చూస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో టి‌డి‌పి నుంచి ఓడిపోయిన సునీల్ వైసీపీలోకి వెళ్లారు..ఆయన మళ్ళీ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారా ? లేక వేరే సీటులో ఏమైనా పోటీ చేస్తారా ? అనేది క్లారిటీ లేదు.

Prominent YSRCP leader into Janasena?

అదే సమయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు సైతం కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటు టి‌డి‌పి విషయానికొస్తే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్…కాకినాడ పార్లమెంట్ సీటు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ జనసేనకు బలం ఉంది. అయితే టి‌డి‌పి – జనసేన పొత్తు ఉంటే..డౌట్ లేకుండా ఈ సీటు గెలిచే ఛాన్స్ ఉంది. పొత్తు లేకపోతే హోరాహోరీ పోరు జరుగుతుంది.