చిత్ర పరిశ్రమలో ఉండే చాలామంది హీరోయిన్లు పెళ్ళికి ముందే షరతులు పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకుంటారని టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికే పెళ్లయిన చాలామంది హీరోయిన్లకు ఈ షరతులతోపెళ్లిళ్లు జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అలా పెళ్లిళ్లు చేసుకున్న వారిలో బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, బబ్లి బ్యూటీ హన్సిక కూడా పెళ్లికి ముందే ఇలాంటి కండిషన్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
అదేవిధంగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న తమన్నా – విజయ్‌వర్మ కూడా ఇలాంటి కండిషన్స్ పెట్టుకున్నారట. మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా ఇలాంటి కండిషన్లతోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం లావణ్య త్రిపాఠికి కొన్ని షరతులు కూడా పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ విషయం ఇలా ఉంచితే కాజల్ అగర్వాల్ పెళ్లి సమయంలో కూడా ఆమె భర్త గౌతమ్ కిచ్చులు ఓ కండిషన్ పెట్టాడట. ఆ కండిషన్‌కు ఒప్పుకున్న తర్వాతే కాజల్‌తో పెళ్లికి ఒప్పుకున్నాడట. తెలుగులోనే కాజల్ స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి అయ్యాక కాజల్ ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజు ఒక గంట కచ్చితంగా కాజల్ తనతో స్పెండ్ చేయాలని.. ఆ ఒక్క గంట తనకోసం కేటాయిస్తే ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని కండిషన్ పెట్టాడట.
కాజల్ సినిమాల్లో బిజీగా ఉన్నందున, ఇది సాధ్యమవుతుందా అని కొన్ని రోజులు ఆలోచించి, ఆ షరతుకు అంగీకరించి గౌతమ్ కిచ్చులుని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కొన్ని రోజులు గౌతమ్ కి ఫుల్ టైమ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయి బాబు పుట్టిన తర్వాత కూడా ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తోంది..!!