టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు జన్మనివ్వగా.. ఇప్పుడు రెండోసారి గర్బవతి అయిందనే ప్రచారం జరుగుతోంది. రెండోసారి గర్భం దాల్చడంతో కాజల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుుందనే ప్రచారం నడుస్తోంది. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కాజల్ ఇటీవల ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సంతకాలు చేయలేదు.
కొత్త సినిమాలను వేటిని ఒప్పుకోకపోవడంతో కాజల్ అగర్వాల్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లైన తర్వాత పెండింగ్ సినిమాలను కాజల్ పూర్తి చేసింది. ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమాలను పూర్తి చేసుకుంది. ఇక బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలయ్యతో కలిసి కాజల్ అగర్వాల్ తొలిసారి నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో తెలుగు హీరోయిన్ శ్రీలీల కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అయితే రెండోసారి గర్భం దాల్చడం, పిల్లలను చూసుకోవడానికి సమయం కావాల్సి ఉన్నందున కాజల్ ఇక తన సినిమా కెరీర్‌కు గుడ్ బై చెప్పనుందని చెబుతున్నారు. కాగా లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కృష్ణవంశీ నటించిన చందమామ సినిమాతో కాజల్ హిట్ అందుకుంది. ఇక మగధీర సినిమాతో కాజల్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోల అందరి సరసన కాజల్ నటించింది.