కాజల్ తన 16ఏళ్ల సినీ కెరీర్ లో ఇన్ని సినిమాలను వదులుకుందా.. అన్ని హిట్ సినిమాలే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విజయం అందుకో లేకపోయినా కాజల్ తర్వాత వచ్చిన సినిమాలతో విజయాలను అందుకునీ స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. ఇక అదే సమయంలో కాజల్ తన 16 సంవత్సరాల సినీ కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు కూడా వదులుకుంది. కాజల్ వదులుకున్న పలు సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Krishnarjuna - Wikipedia

కృష్ణార్జున: మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమాలో మంచు విష్ణుకు జంటగా మమతా మోహన్ దాస్ నటించింది. ఈ సినిమాను చంద్రముఖి లాంటి సూపర్ హిట్ సినిమాన తెరకెక్కించిన పి వాసు డైరెక్షన్లో వచ్చింది. అయితే ఈ సినిమాలో ముందుగా కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఈమె ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో మమతా మోహన్ దాస్ ని తీసుకున్నారు.

Yama Donga (2007) | Cast & Crew | News | Galleries | Movie Posters | Watch Yama Donga Movie Online

యమదొంగ: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో తారక్‌కు జంటగా ప్రియమణి నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో కూడా ముందుగా హీరోయిన్‌గా కాజల్‌ను అనుకున్నారట. కాజల్‌కు రాజమౌళి మధ్య కొన్ని డిఫరెన్స్ రావడంతో ఈమెను ఈ సినిమా నుంచి తప్పించారు.

Cheekati Rajyam Posters "Telugu Movies, Music, Reviews and Latest News"

తుంగవనం: లోక నాయకుడు కమలహాసన్న్ హీరోగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో చీకటి రాజ్యంగా విడుదల చేశారు. ఈ సినిమాలో కూడా ముందుగా కాజాలనే హీరోయిన్గా అనుకున్నారు.అయితే ఆమె ఈ సినిమాకు నో చెప్పడంతో తర్వాత త్రిషను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ యావరేజ్ గా నిలిచింది.

Lion Movie Review (2015) - Rating, Cast & Crew With Synopsis

లయన్: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాను సత్య దేవ్ అనే దర్శకుడు తెర్కేకించాడు. ఈ సినిమాలో కూడా బాలయ్యకు జంటగా ముందుగా కాజల్ అగర్వాల్‌ను అనుకున్నారట.ఆమె పలు కారణాల చేత ఈ సినిమాకు నో చెప్పడంతో మెయిన్ హీరోయిన్గా త్రిషను తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా రాధిక అప్డే నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Gautamiputra Satakarni Review {3.5/5}: Nandamuri Balakrishna's film is certainly a must-watch for someone who feels strongly about the Telugu culture, language and history

గౌతమీపుత్ర శాతకర్ణి: నట‌సింహం నందమూరి బాలకృష్ణ 100 సినిమాగా వచ్చిన ఈ సినిమాను క్రిష్ తెరకెక్కించగా బాలయ్యకు జంటగా శ్రియ నటించింది. ఈ సినిమాలో కూడా ముందుగా బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ ను అనుకున్నారట. అదే సమయంలో చిరంజీవి సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు నో చెప్పింది. దీంతో శ్రియను తీసుకున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

Meghastar Acharya review : మెగా 'బోర్ ' - ఆచార్య రివ్యూ - Tolivelugu తొలివెలుగు

ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ తెర్కెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరుకు జంటగా కాజల్ నటించింది. వీరిద్దరి మీద ఓ సాంగ్ ని కూడా షూట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కాజాల్‌ను ఈ సినిమా నుంచి తెప్పించారు. ఆమెతో చేసిన షూటింగ్ ని కూడా సినిమా నుంచి తొలగించారు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Watch Akhanda - Disney+ Hotstar

అఖండ: బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీలో కూడా కాజల్ కి హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె నో చెప్పడంతో ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నారు. ఇలా కాజల్ తన కెరీర్లు ఇవే సినిమాలు కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకుంది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈమె చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది.