చిత్ర పరిశ్రమలో వండే సెలబ్రిటీల మధ్య లవ్‌లు, డేటింగ్ లు, ఎఫైర్లు ఎప్పుడు కామన్ గా అనిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎవరు ఊహించని ఓ రంగుల ప్రపంచం. ఈ మాయ లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చిత్ర పరిశ్రమలో ఉండే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలోకొందరు స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నారు. మరికొందరు హీరోయిన్లు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు.
మరి కొంతమంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేని వ్యాపారవేత్తలను కూడా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. తన చిన్నప్పటినుంచి స్నేహితుడుగా ఉన్న గౌతమ్ కిచులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ప్రస్తుతం సెకండ్ ఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించి తన వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంది.
అదే సమయంలో కాజల్‌ను ఓ నెటిజన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగిన ప్రశ్నకు కాజల్ అదృష్టం రెండో సంవత్సరాల క్రితమే వేరే వారికి దక్కింది అంటూ ఎంతో ఫన్నీగా అభిమానులకు కూడా కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ సమయంలోనే కాజల్ భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే కాజల్ భర్త ఈమె కంటే ముందే చిత్ర పరిశ్రమలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ ను ఎంతో గాఢంగా ప్రేమించాడట.
అంతేకాకుండా ఆమెతో డేటింగ్ కూడా చేశాడట.. నిజానికి కాజల్- గౌతమ్ చిన్నప్పటి నుంచి ఎంతో మంచి స్నేహితులు అయినా వారి మధ్యలో ఎలాంటి ఫీలింగ్‌లు ఉండేవి కాదట. ఆ సమయంలోనే గౌతమ్ వేరే హీరోయిన్ ను ప్రేమించాడట. అయితే ఆ హీరోయిన్ గౌతమ్ వెనకాల ఆస్తిని మాత్రమే ఇష్టపడిందట. అతను ఇచ్చే డబ్బులు తీసుకుని వాడుకుని గౌతమ్ ని వదిలేసేదట. ఆ తర్వాత గౌతమ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట ఆ సమయంలోనే కాజల్ అతనికి దగ్గర అయింది. దీంతో కాజల్ చూపించిన ప్రేమని అదే నిజమైన ప్రేమగా భావించి కాజల్ ను పెళ్లి చేసుకున్నాడు గౌతమ్.