గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో ఓటిటి వెబ్ సిరీస్ లో క్రేజ్ నడుస్తుంది. సినిమాల కంటే ఓటిటి ద్వారా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లకే ఎక్కువ క్రేజ్ రావడంతో చాలా మంది వెండితెర స్టార్ నటులు కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజోల్ కూడా వారిలో ఒకటి. ” త్రీబంగా ” అనే సినిమాతో ఓటీటీ లోకి అడుగుపెట్టిన కాజోల్ తర్వాత ” ద ట్రయల్ , ” లాస్ట్ స్టోరీస్ 2 ” వెబ్ సిరీస్‌లలో నటించింది.
లస్ట్ స్టోరీస్ 2లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను నటించిన కాజల్.. దీ ట్రైల్ సిరీస్ లో ఇద్దరు నట్టులతో లిప్ కిస్ సన్నివేశాన్ని చేసింది. దీంతో ఈ విషయాన్ని హాట్ టాపిక్ చేస్తున్నారు నెటిజన్స్. ” గుడ్ వైఫ్ ” అమెరికన్ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కాజోల్ కి భర్తగా జిసుసేన్ గుప్తా, బాయ్ ఫ్రెండ్‌గా ఆలయ్ ఖాన్ నటించారు.
ఈ వెబ్ సిరీస్ లో వీరిద్దరితోను లిప్ కిస్ సన్నివేశాల్లో నటించింది కాజోల్. దీంతో 45 సంవత్సరాలు వచ్చిన నీకు.. 20 ఏళ్ళ అమ్మాయి ఉంది. ఈ వయసులో లిప్ కిస్ సీన్లు అవసరమా.. అది ఇద్దరితో అలా నటించడానికి సిగ్గు లేదా.. అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. కాజోల్ ఈ సన్నివేశాలు నటించడంతో కొంతమంది కాజోల్ ఫాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.