ఆ సినిమా కోసం కృష్ణుడిగా మారబోతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఇది..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్‌ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ కొరటాల శివ తో దేవర చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను 2024 ఏప్రిల్5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టారు. అందులో ముందుగా ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ సినిమా కూడా ఒకటి ఉందని అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఎన్టీఆర్ చేస్తున్న తొలి సినిమా వార్2. ఈ సినిమాలు ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్‌ కృష్ణుడు పాత్రకు దగ్గరగా ఉంటుందని, అదేవిధంగా హృతిక్ రోషన్ రోల్ కూడా అర్జునుడి పాత్రను పోలి ఉండేలా ఉంటుందని తెలుస్తుంది.

ఈ వార్‌2 లో ఎన్టీఆర్ రోల్ నెగటివ్ స్టేట్స్ లో ఉంటుందని ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి. ఈ సినిమా కూడా 2025లో ప్రేక్షకుల‌ ముందుకు రానుందని సమాచారం. ఇదే సమయంలో ఎన్టీఆర్ బృందావనం సినిమాలో మోడ్రన్ కృష్ణుడుగా కనిపించిగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ వార్2 కోసం మరోసారి కృష్ణుడుగా దర్శనం ఇవ్వబోతున్నాడు యంగ్ టైగర్. ఇలా ఎన్టీఆర్ వార్‌2 సినిమాతో బాలీవుడ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలంటే మరి కొన్ని రోజులు అగాల్సిందే.