బుద్ధుంటే మ‌ళ్లీ ఆ హీరోయిన్‌తో చేయ‌ను… జూనియ‌ర్ ఎన్టీఆర్‌కే చుక్క‌లు చూపించిన హీరోయిన్‌..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్. ఇప్పటికే దేవర సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా లైన్ గా ప్రశాంత్ నీల్‌, వార్ 2 సినిమాలతో బిజీ అవ్వనున్నాడు. అలాంటి ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్‌ సింహాద్రి చేశాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ భూమిక ..హాట్ బ్యూటీ అంకిత హీరోయిన్లుగా నటించారు. అయితే ఎన్టీఆర్ తో ఎక్కువ సీన్లు భూమికకే పడ్డాయి. ఈ క్రమంలోనే అప్పట్లో అంకిత -ఎన్టీఆర్ ని చాలా ఇబ్బంది పెట్టిందని న్యూస్ ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపించింది. అప్ప‌టి సినీ మ్యాగ‌జైన్స్‌లో గాసిప్‌లు బాగా వ‌చ్చేవి.

అవసరం ఉన్నా లేకపోయినా మాటిమాటికి మీద పడుతూ ఎన్టీఆర్‌ని నస పెట్టిందని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆ హీరోయిన్‌తో సినిమా చేయకూడదు అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారట. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌కు సింహాద్రి ఐదో సినిమా. ఐదో సినిమాకే ఓ హీరోయిన్ విష‌యంలో అంత చికాకు ప‌డ‌డం ఎన్టీఆర్‌కు ఏ మాత్రం న‌చ్చలేద‌ట‌. అందుకే ఆ హీరోయిన్ తో మరో సినిమాకి కమిట్ అవ్వలేద‌ట‌.

అంతే కాదు మొదటి నుంచి ఎన్టీఆర్ హీరోయిన్ల‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మన వల్ల ఏ ఆడపిల్లకి చెడ్డపేరు రాకూడదని .. హీరోయిన్ ని ఎక్కడ ? పెట్టాలో అక్కడే పెడుతుంటారు . ఇంకా హీరోయిన్స్ నే ఎన్టీఆర్ మీద ఉన్న ఇష్టంతో మీద మీద పడిపోతూ ఉంటారు . అలా సింహాద్రి సినిమా టైంలో అంకిత, ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెట్టిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ త‌ర్వాత స‌మీరారెడ్డి విష‌యంలో మాత్రం ఎన్టీఆర్‌పై రూమ‌ర్లు వ‌చ్చాయి.