త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోలుగా మారిన ఎన్టీఆర్- రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలో చేసుకుంటూ టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివతో దేవరాజు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ప్రశాంత్ నీల్, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా రీసెంట్‌గానే తండ్రిగా ప్రమోట్ అయ్యాడు.
అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రానుంది. ఈ సినిమా తర్వాత కూడా బుచ్చిబాబుసానా తో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఇలా ఇద్దరు హీరోలు వరుస క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఇద్దరు హీరోల గురించి గతంలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ నో చెప్పిన సినిమాలో రామ్ చరణ్ నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్ కు బృందావనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా వచ్చిన ఎవడు సినిమా. ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్‌కు చెప్పగా.. వారికి కథ నచ్చకపోవడం అలాగే వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఇక తర్వాత వంశీ పైడపల్లి ఇదే కథను రామ్ చరణ్‌కు చెప్పాడు. చరణ్‌కు ఆ కథ నచ్చడంతో ఎవడు సినిమాకు ఓకే చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి రామ్ చరణ్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు రూ.35 కోట్లతో నిర్మిస్తే 60 కోట్ల వరకు వసూలు చేసింది. ఇలా ఎన్టీఆర్ ఓ మంచి సినిమాను తన కేరీర్లో వదులుకున్నాడు.