ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో ఆగిపోయిన భారీ బడ్జెట్ సినిమా ఇదే… టైటిల్ కూడా ఫిక్స్‌..!

నందమూరి తారక రామారావు ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెండు సంవత్సరాలకే మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆది, సింహాద్రి సినిమాలతో మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సింహాద్రి సినిమాతో ఏకంగా అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగరాసేశాడు. జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు అప్పటి స్టార్ హీరోలు సైతం గజగజ వణికిపోయారు.

అప్పుడు సింహాద్రి సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్‌కు ఆ తర్వాత వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు వచ్చాయి. సింహాద్రి తర్వాత వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, అశోక్ సినిమాలు ఎన్టీఆర్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ సినిమాలు వచ్చాయి.

ఈ నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గరుడ అనే టైటిల్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా అనుకున్నారు. రాజమౌళి ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. సినిమా చర్చలు కూడా జరిగి ఆ తర్వాత ఆగిపోయింది. అయితే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుని ఎప్పుడూ అయినా ఎన్టీఆర్ తోనే చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.