మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కోపమనేది వస్తుంది. ఇక కోపాన్ని కొందరు అదుపులో పెట్టుకుంటే మరి కొంత మంది ఆవేశంతో బయటపెట్టేస్తారు. ఒక విధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అందుకే అటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అయితే చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ హీరోలకు కూడా బాగా కోపాలు వస్తూ ఉంటాయట.
నిజానికి వారిని ఎప్పుడు చూసినా ఎంతో ఆనందంగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. సినిమాలతో చేతినిండా బాగా డబ్బులు సంపాదిస్తూ అనుకున్నది నిమిషాల్లో తమ ముందుకు తప్పించుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. అన్ని సందర్భాల్లో వారికి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు వారికి కూడా కోపాలు, బాధలు, కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి.
వాటిని వారు బయటకు చూపించకుండా లోపలే ఆ బాధను భరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వెంటనే ఆ బాధను బయటపెట్టేస్తూ ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరనే చెప్పాలి. టాలీవుడ్‌కు నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
చిన్న వయసులోనే సినిమాల్లో అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరోగా ఎదిగి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని టాలీవుడ్ లోనే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ ఆ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్తూ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 సినిమాలతో బిజీ అవుతున్నాడు.
అలాంటి ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్‌కు కోపం ఎక్కువ అని.. ఆయన కోపం ఆయన కళ్ళలోనే కనిపిస్తూ ఉంటుందని.. ఇదే సమయంలో ఎన్టీఆర్ కోపాన్ని ఇప్పటివరకు మనం సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేదు. కొద్ది రోజుల కింద ఒక ఈవెంట్లో యాంకర్ సుమ ఎన్టీఆర్ సినిమా గురించి అడగటంతో వెంటనే ఎన్టీఆర్ కళ్ళు పెద్దవి చేసి తనపై కోపంగా చూసాడు. అదే సమయంలో అందరూ ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా అంటూ వీడియోను బాగా వైరల్ చేశారు.
అయితే ఇక్కడ ఇంకో విషయం గురించి మాట్లాడితే మాత్రం ఎన్టీఆర్‌కు విపరీతమైన కోపం ఉందట.. చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌కు ఆడవాళ్లు అంటే చాలా గౌరవం అయితే ఎవరైనా వ్యక్తులు, అమ్మాయిలు, ఆడవాళ్ళ గురించి వల్గర్ గా మాట్లాడిన వారితో అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే ఎన్టీఆర్‌కు విపరీతమైన కోపంతో పాటు ఆయన బీపీ కూడా 170 దాటిపోతుందని అంతేకాకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడిన వారి చెంప చెల్లుమనిపిస్తాడని కూడా తెలిసింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది