ఇండస్ట్రీలో ఒక్కోసారి కొన్ని సెంటిమెంట్లు బాగా వర్క్ అవుట్ అవుతూ ఉంటాయి. కావాలని సెంటిమెంట్ ఫాలో కాకపోయినా అదే సెంటిమెంట్ రిపీట్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక సెంటిమెంట్ ఎన్టీఆర్ సినిమాల్లో రిపీట్ కాబోతుంది. ఈ సెంటిమెంట్ కనుక వర్క్ అవుట్ అయితే ఎన్టీఆర్ దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ కలెక్షన్ వసూలు చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది డైరెక్టర్ తో పని చేసిన సంగతి అందరికీ తెలుసు.
ఎన్టీఆర్ అనుకోకుండా ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తీస్తే అది హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఎన్టీఆర్ ఇప్పటికీ ఆరు సినిమాలను ఫ్లాప్ డైరెక్టర్‌తో తెరకెక్కించి తన ఖాతాలో హిట్స్ వేసుకున్నాడు. వంశి పైడిపల్లి మొదట ప్రభాస్ తో తీసిన మున్నా సినిమా అట్టర్ ప్లాప్ అయింది ఆ తర్వాత వంశి పైడిపల్లికి అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి వంశీ పైడిపల్లి కాంబినేషన్లో బృందావనం మూవీలో నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో తెరకెక్కించిన బిజినెస్ మాన్ తరువాత అన్ని వరుస ప్లాపులను ఎదుర్కొన్నాడు.
ఫైనల్ గా ఎన్టీఆర్ తో తెరకెక్కించిన టెంపర్ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత మహేష్ బాబు నేనొక్కడినే ఫ్లాప్ తో ఉన్న సుకుమార్ కు తర్వాత కూడా వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. అలాంటి టైంలో ఎన్టీఆర్ తో రూపొందించిన నాన్నకు ప్రేమతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న డైరెక్టర్ బాబి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ ని చవి చూశాడు. అప్పట్లో ఒకరు కూడా బాబీకి అవకాశం ఇవ్వడానికి ముందడుగు వేయలేదు కానీ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో అవకాశాన్ని ఇచ్చారు ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇక చివరిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడంతో తర్వాత ఎన్టీఆర్ అరవింద సమేత తో హిట్ కొట్టడం జరిగింది. ఇలా వరుసగా డైరెక్టర్ల ఫ్లాప్ సినిమాలు తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిట్ కావడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్, చిరంజీవి మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్య సినిమా ఫ్లాప్ చూసిన కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర సినిమా మొదలు పెట్టాడు. ఒకవేళ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే దేవరా సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు ప్రముఖులు.