ఎన్టీఆర్ – రష్మిక కాంబినేషన్లో మిస్ అయిన సూపర్ హిట్ ఇదే..!

ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కల్పించే క్రేజీ కాంబినేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఈ కాంబోలో సినిమా వస్తే చూద్దామని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నా అది సెట్ అవ్వదు. అలా మనం మిస్ అయిన ఒక క్రేజీ కాంబినేషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేషనల్ క్ర‌ష్ రష్మిక కాంబో. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడో ఓ సినిమా రావాల్సి ఉంది. అదే అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమాకు ముందుగా త్రివిక్రమ్ రష్మికనే హీరోయిన్గా అనుకున్నాడట.

రష్మికని పెట్టి ఈ సినిమా తెరకెక్కిస్తే క్రేజీగా ఉంటుంది.. ఎన్టీఆర్ ప‌క్క‌న‌ బాగా సెట్ అవుతుంది అనుకున్నాడట. రష్మికని కథ కూడా వినిపించాడట. అయితే ఆమె వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక పోయిందట. అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రష్మిక కొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా కాల్ షీట్లు ఇస్తాన‌ని త్రివిక్రమ్ ని కోరిందట.

త్రివిక్రమ్ అప్పటికే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో తన ఫేవరెట్ హీరోయిన్ పూజ హెగ్డేని హీరోయిన్గా పెట్టి సినిమా తెర‌కెక్కించాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత క్రేజీ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక – మృణల్ ఠాగూర్ వీరిద్దరూ ఎన్టీఆర్ దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌ కోసం పోటీ పడుతున్నారంటూ వార్తలు వినిపిస్తునాయి.

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఆమె బాలీవుడ్‌లో యానిమల్ సినిమాలో నటిస్తోంది. భ‌విష్య‌త్తులో అయినా ఎన్టీఆర్ – ర‌ష్మిక కాంబినేష‌న్ సెట్ అవుతుందేమో ? చూడాలి.