వామ్మో : ‘ దేవర ‘ సినిమాకు జాన్వి కపూర్ అన్ని కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందా..? ఈ పిల్ల భ‌లే జాదునే..!!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ దేవర “. స్టార్‌ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కించ‌బోతున్న‌ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది, ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. కొరటాల శివ ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.

అలాగే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ నటించడానికి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అయిపోతారు. దేవర సినిమాకి జాన్వి కపూర్ ఏకంగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

మేకర్స్ కూడా ఈ సినిమాకు జాన్వి కపూర్ అయితేనే బాగా సెట్ అవుతుందని భావించి మారు మాట్లాడకుండా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత, రకుల్, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్‌లే సినిమాకు రూ.2 నుంచి 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే మొదటి సినిమాతో టాలీవుడ్‌కి ఎంటర్ అయిన‌ జాన్వి కపూర్‌కి అంత రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు అంటూ.. ఇండస్ట్రీలో నెపోటిజం ఏరేంజ్‌లో ఉందో ఈ సంఘటనతోనే అర్థమవుతుంది అంటూ ఈ వార్తలు విన్న నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.