విడాకుల త‌ర్వాత ఆ విష‌యంలో మాత్రం క‌సి క‌సిగా ఉన్న నిహారిక‌, చైతు…!

మెగా డాటర్ నిహారిక – జొన్నలగడ్డ చైతన్య గత కొంతకాలంగా ఈ పేర్లు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా వైర‌ల్ అయిన వీరిద్దరి పేర్లు.. విడాకులు తీసుకున్నారంటూ క్లారిటీ వచ్చిన తర్వాత సోష‌ల్ మీడియాలో మార్మోగుతున్నాయి. వారి విడాకులకు కారణాలు ఏంటి అనే అంశంపై ర‌క‌ర‌కాల న్యూస్‌లు వ‌స్తున్నాయి.

తాజాగా వీరిద్దరూ ఓ విషయంలో మాత్రం కసి కసిగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నిహారిక – చైతన్య విడాకుల ముందు వరకు కూడా కలిసి వర్కౌట్లు చేసేవారు. ఇద్ద‌రు జిమ్‌మేట్స్‌గా వెళ్లేవారు. కొద్దిరోజుల తర్వాత నిహారిక, లావణ్య, చైతన్య కూడా కలిసి ఒకే జిమ్ లో కనిపించారు.

ఆ తర్వాత నిహారిక – చైతన్య వ‌ర్క‌వుట్లు చేశారు. చాలా రోజుల నుంచి నిహారిక వితికాషెరుతో కలిసి జిమ్ లో కనిపిస్తుంది. చైతన్య సింగిల్‌గానే జిమ్‌కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా నిహారిక, వితికలు కలిసి జిమ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేయగా.. నిన్న‌ చైతన్య కూడా జిమ్ లో తన కష్టపడుతున్న ఫోటోలు షేర్ చేసుకున్నాడు.

ఈ ఇద్దరు కూడా తమ ఫిట్నెస్ విషయంలో ఇప్ప‌టికి మంచి కసిగా ఉన్నారని… త‌మ పిట్‌నెస్‌ పోటీని చూపిస్తున్నారని ఈ పిక్స్ ద్వారా అర్థమవుతుంది. నిహారిక ఇప్పటికే వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇటీవ‌ల వచ్చిన హలో వరల్డ్, డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్‌లు సక్సెస్ కావడంతో పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ నిర్మాతగా కంటిన్యూ అవుతుంది.