డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆయన వృత్తిగతంగా వైద్యు డు. కానీ, ఓల్డ్ కమెడియన్ రమణారెడ్డితో ఉన్న పరిచయం కారణంగా.. ప్రభాకర్‌రెడ్డి సినిమా రంగంలోకి వచ్చారు. దుక్కిపాటి మధుసూదనరావు వంటివారితో ఆయన స్నేహం మరింతగా సినిమా రంగంలో పుంజు కునేలా చేసింది. ప్రభాకర్‌రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్టుగానే అందరికీ పరిచయం అయినా.. ఆయన రెండు సినిమాల్లో హీరోగా కూడా వర్క్ చేశారు.
ఇక, సినీ ఇండస్ట్రీలో హీరో కృష్ణతో ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో దాదాపు కృష్ణ నటించి, నిర్మించిన చిత్రాల్లో ప్రభాకర్‌రెడ్డికి పెద్ద పీట వేసేవారు. అయితే.. సినిమాల్లో ఎంతో సిన్సియర్‌గా టైం మెయింటెన్ చేసిన ప్రభాకర్‌రెడ్డి నిజజీవితంలోకి వచ్చేసరికి మాత్రం గాడి తప్పారు. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న జయంతిని ఆయన ప్రేమించారు. జయంతికి అప్పటికే వివాహం కావడం గమనార్హం.
అయినా..ప్రభాకర్ రెడ్డి మనసు పెట్టుకున్నారు. జయంతికి ఈ విషయం తెలిసి.. కాదని.. ఔనని కూడా చెప్ప లేదని.. అప్పటి వారు చెప్పుకొనేవారు. చానాళ్ల పాటు ఇద్దరి మధ్య స్నేహం అయితే.. ముందుకు సాగింది. కానీ, ఈ విషయం జయంతి భర్తకు తెలిసి.. ఆమెకు విడాకులు ఇచ్చారు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని ప్రభాకర్‌రెడ్డిపై ఒత్తిడి చేసి.. నానా వివాదానికి ఆమె దారి తీశారని అంటారు.
ఈ ఒత్తిడిని తట్టుకోలేక.. ప్రభాకర్‌రెడ్డి మద్యానికి బాసిన కావడంతో పాటు ఒక సందర్భంగా సూసైడ్ కూడా చేసుకునే ప్రయత్నం చేశారని అప్పటి వారుచెబుతారు. చివరకు హీరో కృష్ణ జోక్యంతో జయంతికి వేరేవారిని ఇచ్చి వివాహం చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఇండస్ట్రీకి చాలా దూరమయ్యారు. ఆ తర్వాత జయంతి రెండో భర్తకు విడాకులు ఇచ్చి తనకంటే చిన్నోడు అయిన రాజశేఖర్ అనే డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆ మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చేసింది.