ఆ పెళ్లయిన హీరో ప్రేమలో పడి తన జీవితం నాశనం చేసుకున్న సదా.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..!

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ సదా.. 40 సంవత్సరాలు వస్తున్నా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవటానికి ప్రధానన కారణం చిత్ర పరిశ్రమలో ఓ పెళ్లి అయిన హీరో చేతిలో మోసపోవడమేనట. అలా సదాను మోసం చేసిన ఆ హీరో ఎవరు ? వీరి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమై మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సదా. ఆ తర్వాత వరుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక ఈ సీనియర్ బ్యూటీ తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక ఈమె కెరీర్ లో జయం, అపరిచితుడు, ప్రియసఖి వంటి ఎన్నో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ సీనియర్ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు జడ్జ్ గా కొనసాగుతుంది. 40 సంవత్సరలు వయసు వచ్చిన సదా ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఆ స్టార్ హీరోనట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాధవన్. ఇక సదా- మాధవన్ కలిసి కోలీవుడ్లో ఎదిరి సినిమా చేసే సమయంలో ప్రేమలో పడ్డారు. అలా ఇద్ద‌రు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేస్తూ వరుసగా ప్రియసఖి, నాన్ అవనాల్, వంటి హిట్ సినిమాల్లో నటించారు.

అంతేకాకుండా ఈ ఇద్దరు చెన్నై, బెంగళూర్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు కలిసి తిరిగిన ఫోటోలు అప్పట్లో మీడియాలో బయటపడటంతో అప్పటికే పెళ్లి జరిగి ఒక బాబు ఉన్న మాధవన్‌ ఇంట్లో ఈ విషయం తెలిసి గొడవలు కూడా మొదలయ్యాయి. అదే సమయంలో సదా కూడా మాధవన్‌ను తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టేదట.

మాధవన్ అందుకు అసలు ఒప్పుకోలేదు. దాంతో సదా తను మాధవన్‌ చేతిలో మోసపోయాను అని తెలుసుకుని అప్పటినుంచి పెళ్లి అనే మాటకి దూరంగా ఉంటూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. మాధవన్‌ కారణంగానే సదా ఇప్పటికి పెళ్లి చేసుకోవటం లేదంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.