రూమ్ లో ఒక్కటే ఉన్న జయలలిత..అసిస్టెంట్ కి ఫోన్ చేసి తప్పు చేయబోతున్నాను అంటూ చెప్పిన శోభన్ బాబు.. అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి స్టార్ హీరోలలో శోభన్ బాబు ఒకరు. అప్పట్లో శోభన్ బాబుకు బీభత్సమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న శోభన్ బాబు జీవితంలో ఒకే ఒక్క మచ్చ ఉంది. జయలలిత అనే ఒక చిన్న బంధం లేకపోతే శోభన్ బాబు కంటే నిజాయితీపరుడు మరియు గౌరవించాల్సిన వ్యక్తి మరెవరు ఉండరు. కానీ జయలలితపై శోభన్ బాబు పెట్టుకున్న అభిమానం మామూలుది కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక క్రష్ ఖచ్చితంగా ఉంటుంది.

ఎలాంటివాళ్ళైనా ఎవరో ఒకరిని ఏదో ఒక స్టేజిలో అభిమానిస్తూనే ఉంటారు. అలా జయలలిత పై అభిమానంతోనే శోభన్ బాబు ఓ తప్పు చేశాడు. జయలలిత మరియు శోభన్ బాబుల మధ్య కొంతమంది చెప్పినట్లు ఎటువంటి తప్పుడు సంబంధం లేదు. అలాగని వారికి ఒకరికి ఒకరు సంబంధం లేదని కాదు. డాక్టర్ బాబు అనే సినిమాలో శోభన్ బాబు, జయలలిత కలిసి నటించారు. ఇదే వారి మొదటి, చివరి సినిమా కూడా. శోభన్ బాబు కి జయలలిత పై అపారమైన ప్రేమ ఉంది అనేది జయలలితకు ముందే తెలిసి ఉంటుంది. ఈ సినిమా ఊటీలో షూటింగ్ జరుగుతున్న టైంలో శోభన్ బాబు ఇంటికి ఫోన్ చేశాడట.

అతని అసిస్టెంట్ ఏచూరి చలపతిరావు ఫోన్ తీశాడు. నేను తప్పు చేయబోతున్నాను రా అంటూ శోభన్ బాబు చలపతిరావుకి చెప్పాడట. చలపతిరావు కూడా తొందరపడి అలా చేయకండి అని చెప్పకుండా మీ మనసుకు ఏది నచ్చితే అదే చేయండి. ఇంతకీ మీరు ఏం తప్పు చేయబోతున్నారు అని అడిగాడని.. ఊటీలో షూటింగ్ నాలుగు గంటలకి ప్యాకప్ అయిపోయింది. నాకు జయలలితకు పక్కపక్క కాటేజీలు ఇచ్చారు. ఆరోజు ఆమె రూమ్ లోకి వెళ్తూ కింద పడిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో నేను ఆమెకు సహాయం చేసి లోనకు తీసుకెళ్లి కూర్చోబెట్టాను. బయటకు వచ్చేస్తుంటే నన్ను ఆమె ఆపేసింది.

ఆమె మాట్లాడుతూ ఒంటరిగా మిగిలిపోయాను.. “అమ్మ పోయాక ఒక దూరపు చుట్టం అన్న వరస వ్యక్తి నా బాగోగులు చూస్తున్నా కూడా అతనికి ఒక పనికిమాలిన వ్యక్తి.. ఎంజీఆర్ కూడా తన దారి తను చూసుకున్నాడు మెల్లగా రాజకీయాలు కూడా నా చుట్టూ చేరుతున్నాయి.. నాకు నువ్వు తోడుగా ఉంటావా అని నన్ను అడిగింది”.. అంటూ శోభన్ బాబు చెప్పాడట. చలపతిరావు మాట్లాడుతూ..” మీరు తోడుగా ఉంటే ఉండండి కానీ ఆమెతో ఇదే చివరి సినిమా కావాలి అలా అయితేనే మీరు సినిమాల్లో హిట్స్ కొట్టగలరు “అని బదులిచ్చాడట. దానికి సరే అన్న శోభన్ బాబు ఆ తర్వాత ఎప్పుడు జయలలితతో మరి ఏ సినిమా చేయలేదు..!!