తెలుగు బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు అంతకుమించి ఇందులో నటించే నటీనటులకు.. టాలెంట్ ఉన్న వాళ్లకు అద్భుతమైన వేదిక అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో జబర్దస్త్ లోకి వచ్చి ప్రస్తుతం కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెడుతున్నారు అంటే ఇక జబర్దస్త్ వారికి ఏ విధంగా అండగా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే ఒకానొక సమయంలో లేడీ గెటప్ లు వేస్తూ అబ్బాయిలే ప్రేక్షకులను అలరించే వాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా జబర్దస్త్ లోకి ప్రవేశించేసరికి వారికి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే జబర్దస్త్ నుంచి కొంత మంది లేడీ కమెడియన్లు ఇబ్బందిపడి బయటకు వెళ్ళిపోతుండడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఇప్పటికే అనసూయ తో పాటు పలువురు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో అనసూయ కూడా జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పరోక్షంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే నిజంగానే జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా అనే విషయంలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకెళితే.. జబర్దస్త్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ లో ఉండే ఒక స్టార్ కమెడియన్ లేడీ కమెడియన్ విషయంలో చాలా మితిమీరి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఈ విషయాన్ని ఆమె మల్లెమాల సంస్థకు తెలియజేయగా ఎవరు పట్టించుకోలేదట.. అంతేకాదు ఆ స్టార్ కమెడియన్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వార్తలు బాగా వినిపించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.