టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ గత కొన్ని రోజులుగా ప్రేమలో పడిందన్న వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది. ఇక తాజాగా తమన్నా తన ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పి అందరినీ ఒకేసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తమన్నా బాలీవుడ్ స్టార్ నటుడు విజయవర్మతో డేటింగ్ చేస్తున్నా విషయం అందరికి తెలిసిందే. ఇదే సమయంలో మరోవైపు తమన్న పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది.
ఈ ప్రేమ విషయం ఇలా ఉంచితే తన ప్రియుడుతో కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా హద్దులు దాటి తన అందాలను ఆరబోయటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అదే సమయంలో తమన్నాతో డేటింగ్ గురించి విజయవర్మ సైతం తనదైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఆయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నా వృత్తిపరమైన జీవితం గురించి చెప్పాలనుకున్నాను కానీ నా పర్సనల్ విషయాల గురించి చెప్పాలని నేనెప్పుడూ అనుకోలేదని విజయ్ వెల్లడించారు.
నాకు సమయం వచ్చినప్పుడు నా పర్సనల్ విషయాలన్నీ బయట బయటపెడతానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తమన్నా- విజయ్‌వర్మ మధ్య నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది అన్న విషయం కూడా బయటపడ్డింది. తమన్నా విజయ్‌తో ప్రేమ విషయం వెల్లడించిన ..ఇతర విషయాల గురించి క్లారిటీ ఇవ్వటం లేదు. విజయ్‌వర్మతో ప్రేమలో ఎప్పుడు పడింది? వీరి ప్రేమ ఎక్కడ పుట్టింది? అనే విషయాల గురించి తమన్నా ఇప్పటికే క్లారిటీ ఇవ్వటం లేదు. తమన్నా సినీ కెరియర్ కూడా ఎవరూ ఊహించిన విధంగా వెళుతుంది. మరి రాబోయే రోజుల్లో తమన్నా -విజయ్‌వర్మ వీరి పెళ్లి అప్డేట్ ఎప్పుడు ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి..?