యాక్ట్రెస్ సన్నీ లియోన్ ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా కుర్రాళ్ళలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందచందాలతో అందరిని ఆకట్టుకునే సన్నీ.. ఫోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో అక్కడ మంచి క్రేజ్ దక్కించుకుంది. బయటకి వచ్చాక యాక్టర్‌గా మారి వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అయింది. ఎవరి ఊహలకు అందని విధంగా సన్నీలియోన్ హీరోయిన్గా ఎదిగింది. అడల్ట్ కంటెంట్ సినిమాలకు సన్నిలియోన్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. బాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్ లో దూసుకుపోతుంది.
ఇది ఇలా ఉంటే సన్నీలియోన్ పర్సనల్ విషయాలు గురించి ఎవరికీ తెలియదు. తాజాగా సన్నీలియోన్ రియల్ లైఫ్ గురించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. సన్నీ అసలు పేరు కరన్‌జిత్ కౌర్ వోహ్రా. మొదట నర్స్‌గా శిక్షణ తీసుకున్న సన్నీ ఆ తర్వాత బ్లూ ఫిలిమ్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టి పాపులర్ గా మారింది. సన్నీలియోన్ అనే పేరు ఆమెకు ఎలా వచ్చిందో ఇంటర్వ్యూలో వివరిస్తూ.. అమెరికాలో ఉన్నప్పుడు సన్నీలియోన్‌ని ఒక మ్యాగజైన్ సంస్థ వారు ఇంటర్వ్యూ చేశారని.. అందులో తన పేరు ఎలా వచ్చిందో వివరించింది.
ఆ పేరు కూడా తనకు సడన్‌గా స్ట్రైక్ అయినది కాదట ఇంటర్వ్యూలో మ్యాగజైన్ వాళ్ళు ఆమె పేరును సన్నీ లియోన్ గా రాశారని పేర్కొంది. అలా సన్నీలియోన్‌కి ఆ పేరు వచ్చిందట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సన్నీ అనేది సన్నీలియోన్ సోదరుడి పేరు. అతని పేరు సందీప్ సింగ్.. కాగా ముద్దుగా సన్నీ అని పిలిచేవారట. మ్యాగజైన్ సంస్థ వారు పేరు అడగగానే ఏం చెప్పాలో తెలియక ఆమె సన్నీ అని చెప్పేసింది. దాంతో నా పేరు సన్నీలియోన్‌గా అయిపోయిందని.. సన్నీ లియోన్ని ఈ విషయంపై వాళ్ళ అమ్మ ఇప్పటికీ తిడుతూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ స్టార్ యాక్టర్ గా ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతుంది.