టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు తర్వాత మరెన్నో అవమానాలు తర్వాత ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్‌గా ఎదిగాడు. ఇదే సమయంలో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తెలుగు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో చిరంజీవి ఏడడుగులు వేశాడు. ఇక అల్లు వారి ఇంటికి అల్లుడు అయ్యాక చిరంజీవి కెరీర్ ఎవరు ఊహించని విధంగా మారిపోయింది.
టాలీవుడ్ లోనే తిరుగులేని హీరోగా మారిపోయాడు. ఇదే సమయంలో చిరంజీవి- సురేఖ పెళ్లి జరగటం వెనక ఎవరికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది. చిరంజీవి తన మామ అల్లు రామలింగయ్యతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇదే సమయంలో చిరంజీవికి సురేఖతో పెళ్లి అవ్వకముందు కూడా అల్లు రామలింగయ్య, చిరంజీవి చేసిన పలు సినిమాల్లో నటించాడు. అయితే చిరంజీవి కష్టపడే తత్వం, తోటి వారికి ఇచ్చే గౌరవం, మాటతీరు.. అల్లు రామలింగయ్య కి బాగా నచ్చాయి.
తన కూతురు సురేఖకు చిరంజీవియే తగిన వాడని ఆయన భావించాడు. ఇదే విషయాన్ని తన కొడుకు అల్లు అరవింద్ కి కూడా చెప్పాడు. అప్పుడే అల్లు అరవింద్ తన తండ్రి అల్లు రామలింగయ్యకి మీరు తొందరపడద్దని చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారట. అరవింద్ చిరంజీవి గురించి ఆరాలు తీయడం షురూ చేశారు. ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పారట.
ఇక ఇదే సమయంలో ఎవరు ఊహించని ఓ ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. ఓ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి- అల్లు రామలింగయ్య ఓకే ట్రైన్లో ప్రయాణించారు. అదే సమయంలో అల్లు రామలింగయ్య మద్యం తీసుకుని చిరంజీవి వద్దకు వెళ్లి తీసుకోమని ఆఫర్ చేశారట. చిరంజీవి మాత్రం తనకు అలవాటు లేదని.. తను తాగానని వద్దని చెప్పేశారట. ఇక ఈ విషయం తర్వాత అల్లు రామలింగయ్యకు చిరంజీవి అంటే ఇష్టం పెరిగిందట.
ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే అల్లు రామలింగయ్య చిరంజీవి కుటుంబంతో మాట్లాడి 1980లో చిరంజీవి- సురేఖల వివాహంని జరిపించారు. ఏదేమైనా ఆ రోజు ట్రైన్ లో పొరపాటున అల్లు రామలింగయ్య ఆఫర్ చేసిన మద్యాన్ని తీసుకుని తప్పు చేసి ఉంటే అప్పుడు చిరును అల్లుడిని చేసుకునే విషయంలో రామలింగయ్య ఆలోచనలు ఎలా ఉండి ఉండేవో ?