శృతిహాసన్.. తండ్రి కమలహాసన్ సినీ బ్యాగ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. కె. రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించిన అనగనగ ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్ తన ఖాతాలో వేసుకుంది.
అందం, అభినయంతో పాటు ఆమెకు డాన్స్, సింగింగ్ ఇలా అదనపు టాలెంట్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం వరుస ఛాన్సులతో దూసుకుపోతున్న శృతిహాసన్ ఇటీవల సీనియర్ హీరోలు బాలయ్య, చిరంజీవిలతో కలిసి నటించి ఒకేసారి రెండు సూపర్ హిట్లు కొట్టింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం శృతిహాసన్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం శృతిహాసన్.. ప్రభాస్‌తో సల్లార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతిహాసన్ తన ఘాటు అందాల ఫోటోషూట్లను, ప్రియుడు శాంతాన్ హజారికా తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోల్స్‌కి గురవుతూ ఉంటుంది. ప్రస్తుతం శృతిహాసన్ – శాంతాన్ హజారికా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మత్తు పదార్థాలు తీసుకుంటుందట.
తనకు తంత్రాలు కూడా వచ్చు… మత్తుకు బానిసై ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తోందని.. అందుకే ఆమెను చాలా మంది డైరెక్టర్లు తమ సినిమాల్లోకి తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. ఈ విషయం ఎప్పటికప్పుడు సంచలనమైన ట్విట్లు చేస్తూ అనేక వివాదాల్లో చిక్కుకుంటోన్న ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ వార్తను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. దీంతోపాటే కమల్ హాస్ – శృతిహాసన్‌లకి గత రాత్రి పెద్ద గొడవ జరిగిందని కూడా ఆ ట్విట్‌లో పేర్కొన్నాడు. ఒక వేళ ఇదే వార్త నిజం అయితే శృతి కెరీర్ క్లోజ్ అవుతుందని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Tom Holland and Zendaya singing ‘Love On Top’ to each other at Beyoncé’s concert.
— Pop Base (@PopBase) June 28, 2023