ఏ రంగంలో అయినా చిరకాల మిత్రులు, శత్రువులు ఉండరనే అంటారు. ఇది ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ విషయంలో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. సాయిధరమ్ తేజ్‌కు గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా ఎంతో హెల్ఫ్ అవుతున్నాడు మేనేజర్ సతీష్. ఇంకా చెప్పాలంటే అతడు సాయికి మేనేజర్ కానే కాదు బెస్ట్ ఫ్రెండ్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉండే సతీష్‌ను సాయితేజ్ కావాలని పట్టుబట్టి తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు.
అసలు వీరిద్దరిది కృష్ణుడు, అర్జనుడు బంధం లెక్క. వీరు అస్సలు చూసేందుకు హీరో, మేనేజర్‌లా కాదు బెస్ట్ ఫ్రెండ్స్‌ను మించిన స్నేహితులుగా ఉంటారని ఇండస్ట్రీ జనాలు చెపుతూ ఉంటారు. సాయికి సతీష్ అంటే ఎంతో నమ్మకం. ఇంకా చెప్పాలంటే తాను ఎంచుకునే కథలు, తీసే సినిమాల్లోనూ అతడిని కీలకం చేస్తాడు. అతడి ఏదైనా చెప్పాడంటే సాయికి ఎంతో గురి.
అలాంటిది వారిద్దరు నిన్న బ్రో షూటింగ్ సెట్లోనే తీవ్రంగా అరుచుకున్నారట. సాయికూడా గట్టిగా మాట్లాడేసి ఇంకెప్పుడు నా మొఖం కూడా చూడొద్దని చెప్పి పంపేశాడంటున్నారు. ఇక సాయికి ప్రమాదం జరిగినప్పుడు సతీష్ అన్నీ తానై చూసుకున్నాడు. ఇక సాయి సినిమాల పబ్లిసిటీతో పాటు మార్కెట్ పెంచేందుకు కూడా తన స్ట్రాటజీలు ఫాలో అయ్యాడు. పైగా విరూపాక్ష వైజాగ్ ఏరియా రైట్స్‌కూడా సతీష్ తీసుకున్నాడు.
పైగా కేకలు పెద్దపెద్దగా వేసుకున్నట్టే బ్రో యూనిట్ ద్వారా మ్యాటర్ లీక్ అయ్యింది. అసలు వీరి మధ్య నిజంగానే గొడవ జరిగిందా ? అంటే ఇండస్ట్రీ జనాలు నమ్మలేకపోతున్నారు. అయితే ఇందుకు కారణం ఏంటంటే సాయితేజ్ తల్లి తమ సమీప బంధువు అయిన సతీష్ అనే మరో వ్యక్తిని సాయి వ్యవహారాలు చూడమని పురమాయించారట.
తల్లి చెప్పడం.. అటు ఆ సతీష్ అనే వ్యక్తి కూడా బంధువు కావడంతో సాయితేజ్ అతడిని తన దగ్గర పెట్టుకున్నాడు. నేను ఉండగా మరో వ్యక్తి కూడా మేనేజర్‌గా ఎలా ? వస్తాడని సతీష్ సాయిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ వరకు వెళ్లిందంని గుసగుసలాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి అసలు నిజాలేంటో వారికే తెలియాలి. ఏదేమైనా సాయితేజ్ తల్లి పెట్టిన కొత్త మేనేజర్ ఎఫెక్ట్‌తోనే సాయితేజ్ తన బెస్ట్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేవరకు వెళ్లిందన్నమాట.