మోహన్ బాబు అంటే హీరోయిన్ రాశికి అంత ఇష్టమా..? ఆయన కోసం అంతకు తెగ్గించిందా..?


చిత్ర పరిశ్రమలో నటించే హీరోయిన్లకు కథ డిమాండ్ చేస్తే ఎంతైనా ఎక్స్పోజింగ్ చేసే ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. కానీ ఒకప్పటి సంగతి వేరు. గతంలో హీరోయిన్లు ఎలాంటి సన్నివేశాలో న‌టించాలంటే చాలా భయపడేవారు. అలా నటించాలని ఒప్పుకోవాలంటే ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసేవారు. కాగా హీరోయిన్ రాశి మోహన్‌బాబు సినిమాలో బట్టలు లేకుండా ఓ సన్నివేశంలో నటించిందట.

Postman (1999) - Posters — The Movie Database (TMDB)

ఆ రోజుల్లో ఆ సినిమాపై పెద్ద వివాదమే చోటుచేసుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే ‘పోస్ట్ మాన్’.. మోహన్ బాబు హీరోగా ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2000 సంవత్సరంలో చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాం రా చిత్రాలకు పోటీగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను ఆ టైంలో ప్రేక్షకులు ఎవరో పట్టించుకోలేదు. అయితే అదే సమయంలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన రాశి ఓ సన్నివేశంలో బట్టలు లేకుండా నటించి అందరికి షాక్ ఇచ్చింది.

Postman (1999) - IMDb

‘సతీ అనసూయ త్రిమూర్తలకి అన్నం వడ్డించినట్టు వడ్డించాలి’ అంటూ ఓ సన్నివేశంలో మెయిన్ హీరోయిన్ సౌందర్యతో రాశి పందెం కడుతుంది. ఈ క్రమంలో రాశి ఆ విధంగా నటించాల్సి ఉంది. ఈ సీన్ తొలగించాలని మహిళా సంఘాలు అప్పట్లో గొడవ గొడవ చేశాయి. అలా ఈ సినిమా పై జనాల ఫోకస్ అయ్యింది. ఈ ఒక్క సన్నివేశంతో ప్లాఫ్ అవ్వాల్సిన సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ పై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ బాగానే అలరిస్తుంది.’