టాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే. నటుడుగా శరత్ బాబు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శరత్ బాబు ఆస్తులకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆ సమస్యలను మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. ఇదే క్రమంలో శరత్ బాబుకు డైరీ రాసే అలవాటు ఉంది.
ఇప్పుడు తాజాగా ఆయన రాసుకున్న డైరీ బయటపడటంతో ఎవరికి తెలియని కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శరత్ బాబు తన డైరీలో తన జీవితంలో ఎదురైన సమస్యలను, తను సినిమాలో నటించే సమయంలో ఎదురైన ఇబ్బందుల గురించి, తన ఫ్యామిలీ గురించి ఇతర విషయాల గురించి రాసుకొచ్చారని తెలుస్తోంది.
ఇక ఇదే క్రమంలో తన చివరి రోజుల్లో హార్స్‌లీ హిల్స్ లో ఇల్లు కట్టుకోవాలని భావించిన శరత్ బాబు అక్కడ ఓ స్థలం కూడా తీసుకుని ఇంటి పనులు కూడా మొదలుపెట్టారని భోగట్టా..! ఇప్పుడు ఆ ఇంటి పనులు పూర్తి కాకముందే శరత్ బాబు మృతి చెందారు. ఇక శరత్ బాబు తన జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ఆయనకంటూ వారసులు కూడా లేరు.
దీంతో ఆయన సంపాదించుకున్న ఆస్తులు అన్ని తన సోదరీ, సోదరుల పిల్లలకు చెందేలా వీలునామ రాసారని తెలుస్తుంది. అయితే శరత్ బాబు తన జీవితకాలంలో వివాదాలకు దూరంగా ఉండేవారు.. ఇక అతి త్వరలోనే శరత్ బాబు వీలునామాకు సంబంధించి మరికొన్ని వివరాలు కూడా తెలిసి అవకాశం ఉందని అంటున్నారు.