టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ సినిమా స్పై. కార్తీకేయ 2 లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత నిఖిల్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇక స్పై సినిమా విషయానికి వస్తే గ్యారీ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన సినిమా. సెన్సారు పూర్తయింది. కార్తికేయ 2 తరువాత నిఖిల్ సినిమా అంటే పాన్ మార్కెట్ నడుస్తోంది.
ఇక ఈ సినిమాను నిర్మాత ఎప్పుడో మంచి రేట్లకు అటు థియేటర్, ఇటు నాన్ థియేటర్ మార్కెట్ చేసేసారు. ఇక నిర్మాత రిలీజ్‌కు ముందే మంచి లాభాలు కళ్ల చూడడంతో ఫుల్ హ్యాపీ. సినిమా హిట్ అయితే బయ్యర్లు, హీరో నిఖిల్ మరింత ఫుల్ హ్యాపీ. ఇక ట్రైలర్ అయితే సినిమాపై ఇప్పటి వరకు ఉన్న హైప్ మరింతగా పెంచేసింది.
ట్రైలర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాయింట్, రానా స్పెషల్ రోల్.. పైగా కార్తీకేయ 2 తర్వాత భారీ అంచనాలతో వస్తోన్న నిఖిల్ సినిమా కావడంతో ఈ సినిమా మీద చాలా పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆంధ్ర ఏరియాను ఆరు కోట్ల రేంజ్ లో ఎప్పుడో మార్కెట్ చేసేసారు. సినిమాలు లేకపోవడంతో కొన్న కింద వాళ్లకు అమ్మేశారట.
ఇక నైజాంలో ఈ సినిమాను కొన్న వాళ్లు అందరూ దిల్ రాజు కు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. ఇక ఈ నెల 29న
స్పై సినిమాతో పాటు సామజవరగన కూడా రిలీజ్ అవుతోంది. శ్రీ విష్ణు సినిమా నిఖిల్‌కు పెద్దగా కాంపిటీషన్ కూడా కాదనే అనుకోవాలి. ఏదేమైనా స్పై సినిమాకు రిలీజ్ కు ముందే సూపర్ టాక్ అయితే వచ్చేసింది.