సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం మూవీ గత కోన్నీరోజులుగా రెగ్యులర్‌గా వార్తల్లోనే ఉంటుంది. రెండు నెలల ముందు మహేష్ సమ్మర్ వెకేషన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. ఇవాళ గుంటూరు కారం కొత్త షెడ్యూల్ మొదలైంది. శంకర్‌పల్లి సమీపంలోని జన్వాడ దగ్గర వేసిన భారీ సెట్‌లో ఈ రోజు నుంచి కొత్త షెడ్యూల్ మొదలయ్యింది.
ఇక మరోవైపు గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా వెల్లడించలేదు కానీ, ఈ వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అయితే ఇప్పుడు పూజా హెగ్డే స్థానంలో హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల్ని బాగా అలరించిన మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో కూడా అధికారిక ప్రకటన రానుంది.
దాదాపు నెలరోజుల తర్వాత గుంటూరు కారం షూటింగ్ ఇలా మొదలైందో లేదో సోషల్ మీడియాలో ఆలా లీకులు బయటకు వచ్చేసాయి. మహేష్ బాబు చిన్నప్పటి వాల్ ఫొటోస్ శ్రీలీలా, మహేష్ బాబు ఉన్న మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మహేష్ గుంటూరు కారం సినిమాకి లీకులు కొత్తేమి కాదు.. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి.
ఇక ముందుగా మహేష్ తలకు కచీఫ్ కట్టుకున్న ఫోటో రాగా, తర్వాత బీడీ తాగుతున్న ఫోటో ఇలా ఈ సినిమాలోని మహేష్ లుక్స్ అన్ని షూటింగ్స్ స్పాట్ నుంచి బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న గుంటూరు కారం షూటింగ్ స్పాట్ నుంచి మరిన్నీ లీకులు బయటకు వస్తాయో చూడాలి. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.