బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘ విరూపాక్ష ‘ ఊచ‌కోత‌… సాయిధ‌ర‌మ్ కెరీర్ రికార్డ్‌..!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమా రఫ్ఫాడించేసింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా శుక్రవారంతో పోలిస్తే శని, ఆదివారాల్లో ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఫలితంగా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రు. 44 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి సాయి ధరంతేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. విరూపాక్ష తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ రు. 18 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఇది మామూలు విషయం కాదు. విరూపాక్ష సినిమాకు నైజాం నుంచి ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అవడంతో పాటు సాయి తేజ్‌ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఆరు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. త్వరలోనే మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరబోతుంది. విరూపాక్ష దెబ్బతో బాక్సాఫీస్ దగ్గర పార్ట్ 1, సమంత శాకుంతలం సినిమాలు పూర్తిగా వాష్ అవుట్ అయిపోయాయి.

సమంత లీడ్‌రోల్ పోషించిన శాకుంతలం సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక విరూపాక్ష రావడంతో అసలు శాకుంతలం సినిమా అన్ని థియేటర్ల నుంచి ఎత్తేశారు. ఏది ఏమైనా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రు. 44 కోట్ల గ్రాస్ రాబట్టిన విరూపాక్ష రు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.