ఎంతో మంది స్టార్ హీరోలకు హిట్‌లు ఇచ్చిన విజయశాంతి.. ఆ స్టార్ హీరోకు మాత్రం అంత పెద్ద బొక్క పెట్టేసిందిగా..!

మన టాలీవుడ్ సీనియర్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మన టాలీవుడ్ సీనియర్ హీరోలు అంద‌రీతో జతకట్టి ఆడి పాడింది విజయశాంతి. ఎన్టీఆర్, ఏఎన్నార్ పక్కన మాత్రం అసలు నటించలేదు. వీరి తర్వాత వచ్చిన కృష్ణా, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో కూడా విజయశాంతి ఎన్నో సినిమాల్లో నటించింది.

Agniparvatham Telugu Full Length Movie || Krishna,Vijayashanti, Radha ||  Telugu Hit Movies - YouTube

అదే సమయంలో విజయశాంతి కృష్ణ కలిసి 11 సినిమాలకు పైగా నటించారు. వారు నటించిన సినిమాల్లో అగ్నిపర్వతం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే మరో సీనియర్ హీరో శోభన్ బాబు తో కూడా విజయశాంతి 11 సినిమాల్లో కలిసి నటించింది. అలా ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో శ్రావణ సంధ్య బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మరో సీనియర్ హీరో కృష్ణంరాజుతో కూడా విజయశాంతి మూడు సినిమాల్లో నటించింది. వాటిలో రెండు సినిమాలు మాత్రం పెద్దగా ఆడ లేదు.

Gang Leader Full Length Telugu Movie || Chiranjeevi,Vijayashanti - YouTube

ఇక వీరి తర్వాత తరం హీరోలైన చిరంజీవితో మొత్తం విజయశాంతి 19 సినిమాల్లో నటించింది. వాటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. వాటన్నిటికంటే గ్యాంగ్ లీడర్ సినిమా ఎంతో కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మరో స్టార్ హీరో బాలకృష్ణతో కూడా విజయశాంతి 17కు పైగా సినిమాల్లో నటించింది. వీరిది కూడా హిట్ పెయిర్‌గా ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మామయ్య సినిమాతో తొలి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.

Janaki Ramudu || Telugu Full HD Movie || Nagarjuna, Vijayashanti || K.  Raghavendra Rao - YouTube

అలాగే మరో సీనియర్ హీరో నాగార్జునతో విజయశాంతి మూడు సినిమాల్లో నటించింది. వాటిలో జానకి రాముడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచింది. అలాగే వెంకటేష్ తో కూడా విజయశాంతి మూడు సినిమాల్లో నటించారు. వాటిలో శత్రువు సినిమా టాప్ హిట్ అయింది. మరో హీరో సుమన్‌తో కూడా విజయశాంతి పది సినిమాల్లో నటించింది. వాటిలో నేటి భారతం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మరో సీనియర్ హీరో రాజశేఖర్‌తో కూడా విజయశాంతి మూడు సినిమాల్లో నటించింది.

Kunthi Puthrudu Full Length Telugu Movie || Mohan Babu, Vijayashanti ||  Ganesh Videos - DVD Rip.. - YouTube

ఆ మూడు సినిమాల్లో వందేమాతరం, అరుణ కిరణం, రేపటి పౌరురాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అదే సమయంలో మరో సీనియర్ హీరో మోహన్ బాబుతో కూడా విజయశాంతి రెండు సినిమాల్లో నటించింది. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేదు. దాదాపు విజయశాంతి నటించిన అందరూ హీరోలకు విజయాలు ఇచ్చిన మోహన్ బాబుకు మాత్రం విజయశాంతి సక్సెస్ ఇవ్వలేకపోయింది.