ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో 12 సీట్లు ఉంటే..వాటిల్లో సగం పైనే సీట్లలో టిడిపికి ఆధిక్యం ఉంది. కంచుకోటలైన అద్దంకి, పర్చూరు, కొండపి స్థానాలు కాకుండా కనిగిరి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు, గిద్దలూరు స్థానాల్లో టిడిపికి బలం పెరుగుతుంది. అయితే వీటిల్లో దర్శి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా టిడిపికి బలం తక్కువ. 2014 ఎన్నికల్లో గాలిలో అక్కడ టిడిపి గెలిచేసింది.
కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయితే అక్కడ టిడిపిలో పనిచేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, అటు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావు టిడిపిని వదిలి వైసీపీలోకి వెళ్లారు. దీంతో టిడిపికి సరైన నాయకుడు కనిపించలేదు. ఈ క్రమంలోనే పమిడి రమేశ్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన ఇంచార్జ్ గా వచ్చాక దర్శిలో టిడిపి యాక్టివ్ అయింది..కార్యకర్తల్లో దూకుడు పెరిగింది. ఊహించని విధంగా రాష్ట్రంలో అన్నీ మున్సిపాలిటీల్లో టిడిపి ఓడిపోతుంటే..అనూహ్యంగా దర్శిలో టిడిపి గెలిచింది.
అంటే అక్కడ టిడిపి బలం పెరుగుతూ వచ్చింది. ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా పమిడి రమేశ్ టిడిపి ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ సీటుపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. అసలు ఆ సీటు ఎవరికి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారో అర్ధం కాలేదు. ఇదే సమయంలో రమేశ్ ఇప్పుడు టిడిపి ఇన్చార్జ్ రాజీనామాకు చేశారు. దీంతో దర్శి సీటు విషయంలో ఏదో ట్విస్ట్ ఉందని అర్ధమవుతుంది.
ఒకవేళ జనసేనతో గాని పొత్తు ఉంటే..ఆ సీటుని జనసేనకు ఇవ్వాలని బాబు అనుకుంటున్నారా? అనే డౌట్ ఉంది. ఎందుకంటే రమేశ్ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసి చాలా రోజులు అవుతున్నా సరే ఇంతవరకు ఇంచార్జ్‌ని పెట్టలేదు. దీని బట్టి చూస్తే గెలిచే అవకాశం ఉన్న దర్శి సీటుని జనసేనకు వదిలేస్తున్నారా? అనే డౌట్ ఉంది. చూడాలి మరి దర్శి సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.