చంద్ర‌బాబు ఈ స‌వాళ్లు సాధిస్తే ఇక తిరుగేలేదు..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు 73 ఏళ్ల వ‌య‌సులోకి ప్ర‌వేశించారు. సాధార‌ణంగా ఈ వ‌య‌సు అంటే.. రిటైర్మెంట్ వ‌య‌స‌నే చెప్పాలి. ఈ వ‌య‌సులో సాధించింది చాలు.. విశ్రాంతి తీసుకుందామ‌నే 99 శాతం మంది భావిస్తారు. కానీ, చంద్ర‌బాబు ప‌రిస్థితి మాత్రం అలా లేదు. ఇప్పుడు ఆయ‌న ఒక సంధి ద‌శ‌లో ఉన్నారు. ఇన్నాళ్లుగా అంటే.. గ‌త 50 సంవ‌త్స‌రాలుగా ఆయ‌న సాధించింది ఒక ఎత్తు. ఇప్పుడు సాధించాల్సింది మ‌రో ఎత్తు.

ఈ 73 ఏళ్ల వ‌య‌సులో 23 ఏళ్ల యువ‌కుడికి ఉండే ల‌క్ష్యాలు.. చంద్ర‌బాబుకు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న వ్యూ హాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే కాదు.. ఇంకా .. ఈ రాష్ట్రాన్ని తిరుగులేని రాష్ట్రంగా ముందుకు న‌డిపించాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంది. విడిపోయిన రాష్ట్రంలో రాజ‌ధాని నిర్మాణం.. రాష్ట్రాన్ని పెట్టుబ‌డుల ప‌రంగా.. ప్ర‌జ‌ల అభివృద్ధిప‌రంగా ముందుకు న‌డిపించాల‌నే కృత నిశ్చ‌యంతో చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు.

ప‌ట్టుమ‌ని 50 ఏళ్లు కూడా లేని నాయ‌కులు ప‌ది రోజులు వ‌రుస‌గా ప‌ర్య‌టించాలంటే ఆలోచించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అలాంటిది చంద్ర‌బాబు 73 ఏళ్ల వ‌య‌సులో యువ నేత‌గా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. అసెంబ్లీ చేసిన‌.. ` సీఎం అయ్యాకే తిరిగి అడుగు పెడ‌తాను` అన్న శ‌ప‌థం సాకారం చేసుకునేందుకు.. చంద్ర‌బాబు త‌పిస్తున్నారు. ఈ ల‌క్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు.

Regional leaders should lead 3rd front, says AP CM N Chandrababu Naidu

అదే స‌మ‌యంలో త‌న కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌ను కూడా ప్ర‌జానాయ‌కుడిగా తీర్చిదిద్దేందు కు తెర‌వెను అహ‌ర‌హం క‌ష్ట‌ప‌డుతున్నారు. పార్టీకి పున‌ర్వైభ‌వంతోపాటు.. క‌ష్ట‌కాలంలో ఉన్న పార్టీని గ‌ట్టెక్కించి.. అయిపోయింద‌ని అఉకున్న పార్టీకి ఎంతో భ‌విత ఉంద‌నే దిశ‌గా ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుపై ఉంది.. ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబు ల‌క్ష్యాలు.. ఎన్నో ఉన్నాయి.