ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో తన కెరీర్ లోనే ఫస్ట్ టైం డబుల్ హ్యట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలలో వరుసగా ఆరు హిట్‌లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.
ఇక ఇప్పుడు ఈ పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తు వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్తున్నాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నడు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా, ఆ తర్వాత వార్2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయంతెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి సినిమా కూడా తెరకెక్కనుంది. ఇలా వరుస పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమాలే ఎన్టీఆర్ లైనప్‌లో ఉండడం విశేషం.
ఇదే సమయంలో గతంలో ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు విలన్ గా నటించాడు. ఇదే సమయంలో ఈ సినిమాలో విలన్ జగపతిబాబు భార్య పాత్రలో సినియార్ నటి ఈశ్వరీరావు నటిచింది.
ఇక పాత్ర సినిమాకే ఏంతో హైలైట్‌గా ఉంది. అయితే ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ముందుగా మరో సినియార్ హీరోయిన్ లయను అనుకున్నరట. అయితే అనివార్య కారణాలతో అందులో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ప్రముఖ నటి ఈశ్వరీరావుకి ఆ ఛాన్స్ దక్కింది. రెడ్డమ్మ పాత్రకి ఆమె నూరుశాతం న్యాయం చేసింది.
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన హైలెట్ అయింది. ఈ విధంగా లయ ఓ మంచి పాత్రను తన కెరీర్ లో మిస్ అయిందని చెప్పాలి. ఈ క్యారెక్టర్‌లో లయ నటించి ఉంటే ఆమెకు సెకండ్ ఇన్నింగ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి. అలాంటి లక్కీ ఛాన్స్ ఆమె చేజేతులా వదులుకుంది.