మన తెలుగు అమ్మాయి శోభిత ధుళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రీసెంట్గా అక్కినేని హీరో నాగచైతన్య తో డేటింగ్ చేస్తుందన్న వార్తలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ వార్తలు నిజం అనుకునేలా ఈ జంట రెండు మూడు సార్లు కలిసి రెస్టారెంట్లో కనిపించడంతో ఈ డేటింగ్ గాసిప్స్ ఒకసారిగా గుప్పుమన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా శోభిత ధూళిపాళా నటించిన ది నైట్ మేనేజర్2 ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఒక క్లారిటీ ఇచ్చింది.
శోభిత ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలి. వారి జీవితంలో ఎంత ఎదిగినా చాలా అనిగిమనిగి ఉండాలి.. అలాగే సింపుల్గా మంచి మనసు ఇతరుల పట్ల దయా గుణం కలిగి ఉండాలి. తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమించాలి. జీవితం చాలా చిన్నదనే విషయాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఇక దానికి అనుగుణంగా జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి.. ఇక మనసులో ఉన్న తన భర్తకు ఉండాల్సిన లక్షణాలను చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా చైతన్య- శోభిత పై వస్తున్న రూమర్లపై ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఇక అడివి శేష్ హీరోగా వచ్చిన గూడచారి సినిమాతో శోభితా ధూళిపాళ్ల టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కన్నా ముందే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె పలు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన పొనియన్ సెల్వన్ సినిమాల్లో కూడా ఈమె నటించింది. ఇలా అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ శోభిత ధుళిపాళ్ల తన కెరీర్ లో దూసుకుపోతుంది.