ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఈ నలుగురు కూడా నాలుగు స్తంభాల లాంటివారు. వీరందరూ ఒకేతరం హీరోలైనా అప్పట్లో ఒకరంటే ఒకరు పోటీ పడుతూ నటిస్తూ ప్రేక్షకులను అలరించేవారు. ఇక అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ చివరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించారు. అయితే శోభన్ బాబు మాత్రం ఎన్ని డబ్బులు ఇస్తానన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి అసలు ఒప్పుకోలేదట.
ఆయన జీవించి ఉన్నంత వరకు హీరో గానే ఉండాలని అనుకున్నారు. ఆయన కోరుకున్నట్టుగానే శోభన్ బాబు హీరోగానే మరణించారు. అదే సమయంలో శోభన్ బాబు హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో.. ఎందరో హీరోయిన్లు ఆయనను ఇష్టపడే వారట. అలాంటి శోభన్ బాబు పెళ్లి తర్వాత కూడా మరో స్టార్ హీరోయిన్ రాజకీయ నాయకురాలు జయలలితను ప్రేమించేరన్నది తెలిసిందే. ఒకానొక దశలో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట.
ఆ పెళ్లి జరగలేదు.. అయినా జయలలిత శోభన్ బాబుని మర్చిపోలేక చివరి వరకు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. జయలలిత- శోభన్ బాబు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా డాటర్ బాబు ఇది సూపర్ హిట్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జయలలిత తల్లి మరణించింది. ఆమె దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
ఇక దాంతో ఆమెను శోభన్ బాబు దగ్గరుండి అన్ని తానై చూసుకున్నాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని శోభన్ బాబు అప్పట్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అదే సమయంలో శోభన్ బాబు – జయలలిత గురించి తన డైరీలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా రాసుకున్నారు. డాక్టర్ బాబు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా చాలా బరువైన నా మనసుని నీవే తేలిక చేశావు. ప్రపంచమంతా ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అందరితో కలిసి మాట్లాడాలి ఉండాలని అనిపిస్తుందని జయలలిత తనతో చెప్పినట్టు శోభన్ బాబు ఆ డైరీలో రాసుకోచ్చాడు.
నా అనుకున్న వారు నన్ను మోసం చేశారు… నా తల్లి చనిపోయిన కొన్ని నెలలు కూడా కాలేదు.. కానీ ఎన్నో నెలలు అయినట్టు అనిపిస్తుంది. అమ్మను నేను అంతలా మర్చిపోవడానికి ముఖ్య కారణం నువ్వే అంటూ జయలలిత చెప్పిందట. ఇక నా బంధువులు డబ్బుల కోసం మాత్రమే నా దగ్గర ఉన్నారు.. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. నా తల్లి మరణిస్తే నన్ను ఎవరు దగ్గరకు తీసుకోలేదు ఆ సమయంలో నువ్వే నాకు ఎంతో అండగా నిలిచావంటూ శోభన్ బాబు జయలలిత తన ప్రేమను బయటపెట్టిందట. ఈ విషయాలన్నీ శోభన్ బాబు తన డైరీలో ఎంతో క్లియర్‌గా రాసుకున్నారు. ఇక ఏది ఏమైనా ఆ రోజుల్లో జయలలిత- శోభన్ బాబు ప్రేమ ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి.