టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సమంత. తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది.
తాజాగా బాలీవుడ్‌లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత. మరోవైపు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా టామీ హిల్ ఫిగర్ యాడ్‌లో నటించింది. ఈ యాడ్‌లో సమంత కాస్త బొద్దుగా కనిపించి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. రీసెంట్‌గా మయో సైటీస్ వ్యాధి భారిన పడిన తర్వాత సమంత కాస్త సన్నబడి అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి బయటపడిన ఈమె తాజాగా ఇంటర్నేషనల్ బ్రాండ్ టామీ హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్ బ్రాండ్స్‌కి ప్రమోటర్‌గా మారింది. ఇకపోతే ఈ యాడ్ కోసం సమంత భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సమంత ఇలాంటి ప్రకటనలో నటించడం కొత్త కాదు. హీరోయిన్ గా మంచి బిజీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటివి ఎన్నోచేసింది.
అయితే ఇప్పుడు ఆమె రేంజ్ మరో లెవల్లో ఉండడంతో ఈ యాడ్ కోసం ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. స్టార్ హీరోలు కూడా యాడ్స్ కోసం ఈ రేంజ్‌లోనే పారితోషకం తీసుకుంటున్నారు. ఇప్పుడు వారికి ధీటుగాా తన రెమ్యూనిరేషన్‌ను పెంచి అందరికీ షాక్ ఇచ్చింది.