మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా మారిన హీరో ఎవరంటే ఠక్కున వినిపించే పేరు మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవిలా స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి.. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు రవితేజ. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఇలా వరుస సినిమాల్లో నటించి భారీ హిట్లతో టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా మారాడు. ఇదే సమయంలో రవితేజకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారనే విషయం చాలామందికి తెలియదు.
రవితేజ హీరోగా సక్సెస్ అయ్యాక నీకు ఎలాగైనా పెళ్లి చేయాలని రవితేజ తల్లి తన బంధువుల్లో ఉన్న ఓ అమ్మాయిని చూసిందట. ఆమె రవితేజకు మరదలు అవుతుంది. ఆదే సమయంలో ఓ రోజు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు రవితేజ తల్లి కళ్యాణిని చూసి తన కొడుక్కి ఈ అమ్మాయి బాగుంది… తన కొడుక్కి తగ్గ భార్య అవుతుందని భావించి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా ఇంటికి కోడలుగా మీ అమ్మాయిని పంపండి అని మొహమాటం లేకుండా అడుగేసిందట.
దీంతో రవితేజ కూడా హీరోగా మారడంతో వారు కూడా తమ కుమార్తెను రవితేజకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒకే చెప్పారట. ఇదే సమయంలో ఇదే విషయాన్ని రవితేజకి చెబితే ఆమె నాకంటే 12 సంవత్సరాలు చిన్నది.. ఎలా పెళ్లి చేసుకోను అని మొత్తుకున్నా అమ్మ ఫోర్స్ చేయటంతో కళ్యాణిని 2002 మే 26న పెళ్లి చేసుకున్నాడట. ఇక రవితేజకు కళ్యాణితో పెళ్లి జరిగాక… ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
ఇక వీరిద్దరికీ ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇదే సమయంలో రవితేజ- కళ్యాణిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అప్పటినుంచి ఆయన సినీ కెరీర్ కూడా మరో లెవల్ కు వెళ్ళింది. వరుసగా భారీ విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా నిలిచాడు. ఈ విధంగా రవితేజకు పెళ్లయ్యాకే ఆయన కెరీర్ స్వింగ్ అయ్యిందనే చెప్పాలి.