ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు రవితేజ. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ఒకానొక సమయంలో వరుస ప్లాప్లను ఎదుర్కొన్నాడు. ఇకపై ఇండస్ట్రీలో రవితేజ కనిపించడేమో అన్నట్లు మార్కెట్ పడిపోయిన సందర్భం కూడా ఉంది.
ఇక అసలు విషయానికొస్తే రవితేజ కెరియర్ లో ఒక టైం లో వరుసగా 6 ప్లాపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఒక్క హిట్ కానీ రాకపోతే ఇక రవితేజ ఇండస్ట్రీలో కనుమరుగైనట్లే అనుకునే సందర్భానికి ఒక హిట్‌తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఇంతకీ ఏ సినిమాతో రవితేజ మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు? ఒకసారి చూద్దాం. రవితేజ గతంలో దొంగల ముఠా, వీరా, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు ఇలా వరుసగా 6 ఫ్లాప్ లను అందుకున్నాడు. ఫ్లాప్స్ అంటే తక్కువే అవుతుంది ఈ ఆరు సినిమాలు తన కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిపోయాయి.
ఎలాంటి కథ తీసుకొని సినిమా చేస్తే హిట్ అవుతాడు అనే సందేహంలో పడిపోయాడు రవితేజ. అదే టైంలో ఎలాగైనా ఒక హిట్ కొట్టాలన్న కసితో రవితేజ ఉండగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని నుంచి ఒక ఫోన్ వచ్చింది. అప్పటికే రవితేజ – గోపీచంద్ కాంబినేషన్ లో డాన్ శీను హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. రవితేజ వెంటనే గోపీచంద్ మలినేని ని కలిసి కథను వినడం ఆ కధకి ఓకే చెప్పడం ఆ సినిమా తెరపైకి వచ్చి తర్వాత రవితేజకు ఒక హిట్ పడడం జరిగింది. అదే బలుపు సినిమా.
ఈ సినిమాలో శృతిహాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా హిట్ సాధించడంతో రవితేజ తో పాటు శృతిహాసన్, అంజలీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అడవిశేష నెగటివ్ రోల్ ను ప్లే చేశాడు. కమెడియన్ ఏవీఎస్ ఆఖరిగా నటించిన సినిమా ఇదే. ఈ సినిమా హిట్ అయిన తర్వాత బెంగాలీలో రీమేక్ అయింది. ప్రస్తుతం కన్నడలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.