రాజనాల గురించి తెలియనివారు లేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా.. విలనీ పాత్రలు పోషించారు. అ యితే.. ఈయన కూడా.. సినిమా రంగంలోకి టెక్నికల్ అసిస్టెంట్గానే వచ్చారు. తర్వాత.. కాలంలో ఆయన దేహదారుఢ్యాన్ని గమనించిన దర్శకులు.. విలనీ పాత్రల్లో ప్రోత్సహించారు. జానపద సినిమాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న రాజనాల.. అగ్రహీరోలతో సమానంగా నటించారు.
కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన వదిలేసిన సినిమాల్లో ఇతర నటులు నటించినవి కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టుబట్టేవారు కాదు. అయితే.. నిర్మాతలు ఇచ్చే విదేశీ సిగరెట్ బాక్సుల కారణంగానే.. మొహమాటానికి పోయి తాను నష్టపోయాయని.. ఆయన చివరి రోజుల్లో చెప్పుకొనేవారు. ఇక, ఎస్వీ రంగారావుతో జెల్సాలు చేసేవారు.
ఇలా..వచ్చిన మొత్తం వచ్చినట్టు ఖర్చు చేసిన వారిలో రాజనాల ఒకరని అంటారు. అయితే కెరీర్ చివర్లో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల తో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి దీనస్థితిలో మృతి చెందడం మాత్రం కలిచి వేసే విషయం. ఇక, ఆయనకు అప్ప టి వర్ధమాన నటి… తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నరమాప్రభతో పరిచయం ఉందని అంటారు.
రమాప్రభ తొలినాళ్లలో రాజనాల ఇంట్లోనే పైగదిలో మరో నటి శాంత కుమారితో కలిసి ఉండేవారట. అయితే.. అర్ధరాత్రివేళల్లో రాజనాల ఇంటికి వచ్చినప్పడు రమాప్రభను చూడకుండా పడుకునేవారు కాదని.. అప్పట్లో ఒక టాక్ వచ్చింది. అయితే.. ఇంతకు మించి.. ఏమీ లేదని.. ఇది తప్పు కూడాకాదని.. రాజనాల అనేవారు.
రమాప్రభ మా ఇంటికి వచ్చిన తర్వాత.. నాకు అవకాశాలు పెరిగాయి.. అని చెప్పిన ఆయన.. అనేక సంవత్సరాల పాటు.. రమాప్రభ తన ఇంట్లోనే ఉండేలా ప్రోత్సహించారు. తర్వాత.. రాజబాబుతో లింక్ ఉన్నట్టు గ్యాసిప్ రావడం.. వివాదం నేపథ్యంలో రాజనాల ఆమెను ఖాళీ చేయించినట్టు సినీవర్గాల్లో ఒక టాక్ ఉంది. అయితే ఆ తర్వాత రమాప్రభకు రాజబాబుకు మధ్య ఏదో ఉండేదన్న ఉండేదని గుసగుసలు ఉండేవి… ఈ విషయం చాలా మందికి తెలుసు గాని… రమాప్రభ, రాజనాల లింక్ పెద్దగా బయటకు రాలేదు.