రామ్ చరణ్ – రానా రాత్రులు సీక్రెట్ గా అలాంటి పనులు చేసేవారా.. సీక్రెట్ రివీల్ చేసిన చిరంజీవి..!

ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ చాలామంది చిన్న వయసు నుంచే ఫ్రెండ్స్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వారిలో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ – రానా కూడా ఒకరు. వీరిద్దరు చదువుకునే రోజుల నుంచి మంచి స్నేహితులు కావడంతో ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లే వారట. రాత్రులు ఎవరికీ తెలియకుండా ఇద్దరు కొన్ని అల్లర్లు చేసేవారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే ఓ షోలో రివీల్ చేశాడు. వీరిద్దరూ కలిసి రాత్రుళ్ళు కంబైన్డ్ స్టడీస్ చేసేవారట. స్నేహితుల అన్నాక కలిసి తినడం, తిరగడం వగైరా ఇంకేమైనా కలిసి సరదాగా చిలిపి చేష్టలు చేయడం సహజం.

రామ్ చరణ్ – రానా మాత్రం ఇద్దరు కలిసి కంబైన్డ్ స్టడీస్ అని రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకొని కాసేపు చదువుకున్నట్లు నటించేవారట. తర్వాత కిటికీలో ఉండే గ్రిల్స్ ఓపెన్ చేసి సీక్రెట్ గా అందులోంచి బయటకు వెళ్లి చాలాసేపు తిరిగేసి వచ్చిన తర్వాత మళ్లీ ఏమి తెలియనట్టు గ్రిల్స్ ద్వారా రూమ్ లోకి వచ్చి సైలెంట్ గా చదువుకుంటున్నట్టు నటించేవారట. ఈ విషయం ఓ రోజు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చూడడంతో ఆయనకు తెలిసిందని.. ఇటీవల జరిగిన ఓ షోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ క్లీంకార పుట్టిన ఆనందంలో ఎంజాయ్ చేస్తున్నాడు.

అత‌డు నటిస్తున్న ” గేమ్ చేంజర్ ” మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో భారీ రేంజ్ లో తెరకెక్కనుంది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుంది. దీని తర్వాత ” ఉప్పెన ” సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో మరో సినిమాకు సైన్ చేశాడు రామ్ చరణ్. రానా ఇటీవల ” రానా నాయుడు ” వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం తేజ తో కలిసి ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.