మెగాస్టార్ చిరంజీవి నట వారుసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబుతో మరో సినిమాయబోతున్నాడు. ఇక మరో విషయం ఏమిటంటే రీసెంట్ గానే రామ్ చరణ్ తండ్రిగా ప్రమోట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రామ్ చరణ్ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ చిన్నప్పుడు చేసిన ఒక చెత్త పని వల్ల తన తండ్రి చిరంజీవి చేతులో తన్నులు తిన్నారట. రామ్ చరణ్ చేసిన తప్పు ఏంటి చిరంజీవి కొట్టడం వెనుక అసలు స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక రామ్ చరణ్ చిన్నతనంలో స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తూ వారి ఇంటి గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ లాగే బయట ఉండే మరో వ్యక్తి ఇద్దరు గొడవ పడుతున్నారట.
అంతేకాకుండా బండ బూతులు తిట్టుకుంటూ ఒకరు చొకాలు ఒకరు లాక్కుంటూ తిట్టుకుంటు గొడవ పడుతున్నారట. అయితే వీరి గొడవ చూసి అక్కడే ఆగిపోయిన రామ్ చరణ్ వారు తిట్టుకునే మాటలు విని అక్కడే నిలబడి పోయారట. ఆ తర్వాత కొద్ది సేపటికి ఇంటిలోకి వచ్చి అక్కడే ఉన్న చిన్న తండ్రి నాగబాబుతో ఏంటి బాబాయ్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ మరో ఇద్దరూ అలా గొడవ పెట్టుకుంటున్నారు అంటూ వాళ్ళు మాట్లాడుకునే తిట్లు నాగబాబు ముందు చెప్పేసాడట.
ఇక దాంతో రామ్ చరణ్ నోటి నుంచి పచ్చి బూతు మాటలు విని నాగబాబు వెంటనే చిరంజీవి దగ్గరికి తీసుకోవాలి అన్నయ్య చూడండి వీడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో అని చెప్పాడట. ఇక అప్పుడు చిరంజీవి చరణ్ మాట్లాడిన బూతులన్నీ విని రూమ్ లోకి తీసుకువెళ్లి ఇంకోసారి అలా మాట్లాడతావా అంటూ బెల్టు పట్టుకుని చితక్కొట్టేసాడట. తర్వాత బయట కూర్చోబెట్టి అలాంటి మాటలు ఎప్పుడూ నేర్చుకోకూడదు అని బుద్ధి చెప్పారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి రామ్‌చరణ్ అన్న మాటలు విని నెటిజన్లో నవ్వుకుంటున్నారు.