ఏంటి.. రకుల్‌కు తన ప్రియుడుతో ఇప్పటికే నాలుగుసార్లు అయ్యిందా..? సిగ్గుపడకుండా ఓపెన్ గా చెప్పేసిందే..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె ముందుగా టాలీవుడ్ లో తన కెరీర్‌ను మొద‌లు పెట్టి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా అవకాశాలు రావడంతో అక్కడకు చెక్కేసింది. ఇదే సమయం బాలీవుడ్లో రకుల్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.

Rakul Preet looks stunning at boyfriend Jackky Bhagnani's birthday bash -  watch | Hindi Movie News - Times of India

అయితే ఈమెకు సినిమాల్లో పరంగా సక్సెస్ లేకపోయినా వ్యక్తిగత విషయాలతో బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతూ వచ్చింది. ప్రధాన కారణం ఈమె బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇద్ద‌రు ప్ర‌స్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గత కొన్ని రోజులకు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ ఎవరు ఊహించని కామెంట్లు చేసింది.

Rakul Preet Singh: Don't want my relationship to become a talking point |  Bollywood - Hindustan Times

రకుల్ మాట్లాడుతూ..” మేము ప్రేమించుకునే విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉంచడానికి మేమింకా చిన్నపిల్లలం ఏం కాదు. మాకేం భయం లేదు ..మేము దీన్ని ఎంతో ధైర్యంగా బయటపెట్టాం. మా ప్రేమ గురించి ఎన్నోసార్లు చెప్పినా కూడా చాలామంది మేము సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు సృష్టిస్తూనే ఉన్నారు.ఇప్పటికే సీక్రెట్ గా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నామని వార్తలు వైరల్ చేస్తూ వచ్చారు. ఇక ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నాకు ఎంతో నవ్వు వస్తుంది”…అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై విడ్డూరంగా స్పందించింది. ప్రస్తుతం రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.