ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. కొన్ని వందలకు పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన ఈయన ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన జీవితంలో మాత్రం చాలా ఫెయిల్యూర్స్ చూసారని చెప్పాలి. నా అనుకున్న వాళ్లు ఒక్కొక్కరిగా మరణించడం కావచ్చు, కట్టుకున్న భార్య కూడా దూరం పెట్టడం కావచ్చు… ఆయన జీవితం చాలా అస్తవ్యస్తం అయిందని చెప్పాలి. చివరికి ఆయన తన చివరి రోజులలో అనాధ ఆశ్రమంలో బ్రతికి, నిన్న అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు.
దాంతో రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వెలుగు చూస్తున్నాయి. రాకేష్ మాస్టర్ గతంలో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఆయన కెరియర్ ను మార్చిన హీరో గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన లేకపోతే తన జీవితం ఉండేది కాదని, ఆయన వల్లే తన కెరియర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది అని రాకేష్ మాస్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా ఈ విషయాలు విని జనాలు అవాక్కవుతున్నారు.
ఇక ఆ హీరో మరెవ్వరో కాదు, వేణు తొట్టెంపూడి. అవును, ఒక ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడిన రాకేష్ మాస్టర్ “జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అవకాశాల కోసం ఎక్కని మెట్టు లేదు.. తొక్కని గడపలేదు.. అలాంటి సమయంలో వేణు సార్ నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.” అని చెప్ప్పుకొచ్చాడు. అవును, వేణు హీరోగా తెరకెక్కిన చిరునవ్వుతో సినిమాలో “నిన్నలా మొన్నలా లేదురా” అనే పాటకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా అదే ఆయన మొదటి సినిమా కొరియోగ్రఫీ. ఆయన వల్లే నా జీవితం చాలా గొప్పగా మారింది అంటూ రాకేష్ మాస్టర్ తెలిపారు. కాగా ఆయనకు సంబంధించిన వార్తలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.