నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ ప్రాజెక్టులలో సలార్ కూడా ఒకటి. ఆదిపురుష్ – సలార్ – సలార్ 2 – ప్రాజెక్ట్ కే – స్పిరిట్ సినిమా ఇలా ప్రభాస్ లైన్లో అన్ని క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ క్రమంలోనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై జాతీయ స్థాయిలోనే అదిరిపోయే అంచనాలు ఉన్నాయి.
కేజిఎఫ్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమా థియేటర్ బిజినెస్ డీటెయిల్స్ క్లోజ్ చేసే పనిలో నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సలార్ ఓవర్సీస్ రైట్స్ రు. 100 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అంటే ఓవర్సీస్ లో అన్ని భాషల్లో కలిపి బ్రేక్ ఈవెన్ కావాలంటే సలార్ పది మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త మాస్ లుక్ తో కనిపించమన్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ స్థాయిలో ప్రభాస్ లుక్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
కేజీయఫ్ సీరిస్ సినిమాల తర్వాత ప్రశాంత్ డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుండడంతో సౌత్ టు నార్త్ అన్ని భాషల్లోనూ సలార్‌పై అదిరిపోయే పెంచనాలు ఉన్నాయి. ఏదేమైనా సలార్ ప్రి రిలీజ్ బిజినెస్ డీల్స్ చూస్తుంటే నిద్ర పట్టడం లేదు.