అది.. జగన్మోహిని సినిమా తీస్తున్న సమయం. దర్శకుడు బి. విఠలాచార్య ఈ సినిమా మొత్తాన్నీ.. దాదాపు 80 శాతం పాటలు మినహా అంతా.. ఒకే స్టూడియోలో చేసేశారు. అది జెమినీ స్టూడియో. అప్పుడే కొత్తగా నిర్మించారు. తనకు తగిన విధంగా సెట్టింగులు వేయించుకున్న విఠలాచార్య.. కొన్ని కొన్ని రోజుల పాటు.. హీరో , హీరోయిన్లను అక్కడే ఉంచి మరీ శరవేగంగా షూటింగులు పూర్తి చేశారు.
దీనికి కారణం.. ఆషాఢ మాసం వచ్చేస్తోందని.. ఈలోపే సినిమాను విడుదల చేయాలని ఆయన ముహూ ర్తం నిర్ణయించుకోవడమే. అయితే.. స్టూడియోలో మొత్తంగా.. నాలుగు రూములే పూర్తయ్యాయి. వాటిలోనూ.. రెండింటిలోనే ఏసీ సౌకర్యం ఉంది. దీంతో నరసింహరాజుకు ఒక రూం కేటాయించారు. ప్రభ ఇతర నటులకు.. మరో రూం ఇచ్చారు. అయితే.. జయమాలిని రెండు రోజులు ప్రభకు కేటాయించిన రూంలో ఉన్నా… తర్వాత.. ఆ రూం తనకు నచ్చలేదని తాను ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు.
కానీ.. షూటింగ్ ఉదయం 5 గంటలకు మొదలు పెడితే.. రాత్రి 11 అయ్యేది. అప్పటి వరకు మేకప్ తీయ డానికివీల్లేదని.. విఠలాచార్య ఆదేశం. దీంతో ఇంటికి వెళ్లే సమయం కూడా ఉండేది కాదు. దీంతో ఎట్టకేలకు.. ఆమెను నరసింహరాజు ఉంటున్న రూంలో ఉండాలని కోరారు. మొదట తటపటాయించినా.. తర్వాత.. రెండు రోజులు ఆ రూంలోనే జయమాలిని ఉన్నారు. అయితే.. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి.
నరసింహరాజు-జయమాలిని ఒకే రూంలో రోజుల తరబడి పడుకున్నారు.. అనే హెడ్డింగులతో వచ్చిన కథనాలు.. సినిమా ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయ్యాయి. అయితే.. ఇది సినిమాపై ప్రభావం చూపుతుందని భావించిన విఠలాచార్య తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్పారు. ఆతర్వాత కూడా.. ఈ రూమర్లకు అడ్డుకట్ట పడలేదు. అయితే.. సినిమాపై ఇది ప్రభావం చూపకపోవడం గమనార్హం.