చ‌లం కోసం గీతాంజ‌లి అలాంటి తప్పు చేసిందా..? లాస్ట్ రోజుల్లో అంత దుర్భ‌ర స్థితి ఫేస్ చేశాడా..?

సినీ న‌టుడు చ‌లం గురించి త‌క్కువ మందికి తెలుసు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే ఆయ‌న పేరు తెచ్చుకున్నా.. తొలినాళ్ల‌లో సంబ‌రాల రాంబాబు.. స‌హా అనేక సినిమాల్లో న‌టించారు. ఈయ‌న హీరో గా అనేక సినిమాల్లో న‌టించారు. అంతేకాదు.. చాలా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. చ‌లం ఎక్కువ‌గా కుటుంబ క‌థా సినిమాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయ‌న న‌ట‌న చిత్రంగా ఉంటుంది. ఒకే స‌మ‌యంలో హాస్యం.. రౌద్రం పండించ‌గ‌ల న‌టుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

Illalu (1965)

అలాంటి చ‌లం కూడా ఒకానొక ద‌శ‌లో దారి త‌ప్పార‌ని అంటారు అప్ప‌టి నటులు. న‌టి గీతాంజ‌లితో చ‌లం ప్రేమ‌లో ప‌డ్డార‌ని చెబుతారు. అప్ప‌టికే.. ఆమె హ‌రినాథ్‌ను వివాహం చేసుకున్నారు. ఇది కూడా ప్రేమ పెళ్లే అయినా.. చ‌లం ద‌ర్శ‌క‌త్వంలో అనేక సినిమాలు చేసిన గీతాంజ‌లితో చ‌లానికి అనుబంధం ఏర్ప‌డింది. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కూడా షూటింగులు చేయ‌డంతో వీరి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది.

Veteran Actress Geetanjali About Her Husband Ramakrishna రామకృష్ణ విషయంలో  నిలదీసిన గీతాంజలి!

ఇది ప్రేమ‌గా మారి.. వివాహేత‌ర సంబంధం వైపు దారితీసింద‌ని అంటారు. ఇలా.. చ‌లం-గీతాంజ‌లి క‌లిసి జీవించార‌ని ఒక టాక్ ఉంది. ఈ కార‌ణంతోనే హ‌రినాథ్‌తో బంధాన్ని గీతాంజ‌లి తెగ‌తెంపులు చేసుకున్నార ని.. చివ‌ర‌కు ఆయ‌న చ‌నిపోయిన‌ప్ప‌డు కూడా రాలేద‌ని సినీరంగంలో ఒక టాక్ ఉంది. అయితే..త ర్వాత కాలంలో చ‌లంను కూడా ఆమె వ‌దిలి వేసింద‌ని చెబుతారు. దీంతో చ‌లం మ‌ద్యానికి బానిసై చివ‌రి రోజుల్లో చాలా దుర్భ‌ర స్థితిలో మ‌ర‌ణించారు. చ‌లం సినిమాల్లో పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి. ఓ బంగ‌రు రంగుల చిల‌కా.. పాట ఈయ‌న సినిమాలోదే కావ‌డం విశేషం.